Breaking News

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 14,00,415 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం నాటికి రాష్ట్రంలోని 24 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,00.415 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అదివారం 1665 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా 282 మంది దరఖాస్తు చేసుకోగా, వారిరందరికీ ఇసుకను సరఫరా చేసామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్దితులు, వరద ప్రభావిత ప్రాంతాల వల్ల ఇసుక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని, వర్షాకాలం ముగిసిన తరువాత ఇసుక నిల్వలకు కొరత ఉండబోదని మీనా తెలిపారు. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్న పరిస్ధితిలో ఇసుక రవాణాకు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని విన్నవించారు. పలు రీచ్ ల నుండి ఇసుక సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో ఇసుక అందుబాటులోకి వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *