Breaking News

స్వర్ణ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ తయారీపై సమీక్షించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంట్ తయారీపై గురువారం ఉదయం అమరావతి రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ పాల్గొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంలో భాగంగా రాబోయే ఐదేళ్లకు జిల్లా ఏ విధంగా ఉండాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రాథమిక రంగంలో వ్యవసాయం, అటవీ, పశుపోషణ, ఆక్వాకల్చర్, కోళ్ల పెంపకం, మైనింగ్.. ద్వితీయ రంగంలో క్వారీయింగ్, తయారీ.. అదేవిధంగా తృతీయ రంగంలో వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, సేవలు, బీమా మొదలైన అంశాల ఆధారంగా డాక్యుమెంట్ తయారు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు.

ఈ వీడియోకాన్ఫరెన్స్ లో డ్వామా పీడీ జీవి సూర్యనారాయణ, సిపిఓ గణేష్ కృష్ణ, జెడ్పి సీఈవో ఆనంద్ కుమార్, డీఎం అండ్ హెచ్వో డాక్టర్ జి గీతాబాయి, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి శివప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారిణి ఎన్ పద్మావతి, ఆర్ అండ్ బి ఈఈ శ్రీనివాసరావు, భూరికార్డులు సర్వే ఏడి మనీషా త్రిపాటి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *