Breaking News

స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదాం

-జెసి చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన దేశ అభివృద్ధి లక్ష్య సాధన లో దేశ ప్రధాని స్పూర్తితో , రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరం స్వచ్ఛ ఆంధ్రా కోసం కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞను చేయించారు. సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ నేను పరిశభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రతకోసం కొంత సమయం కేటాయిస్తామన్న శపథం ప్రతీ ఒక్కరూ చెయ్యాల్సి ఉందన్నారు.

ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి కనీసం 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని పిలుపు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఎవరికి వారు సంకల్పం తో పరిసరాలను అశుభ్రపరచను, వేరే వారిని అశుభ్రం చేయనివ్వననే.దిశగా అడుగులు వేయాలన్నారు. ఆదిశలో మన కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని, జిల్లా కలెక్టరు ఇప్పటికే మన కార్యాలయం నుంచే స్వచ్చ ఆంధ్రా కోసం కృషి చేయాలని ఆదేశించారన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయి లో, పట్టణ ప్రాంతాల్లో “స్వచ్ఛ ఆంధ్ర మిషన్” తద్వారా” స్వచ్ఛ భారత్ మిషన్” కోసం ప్రచారం కల్పించడం, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరగాలని జాయింట్ కలెక్టర్ తెలియ చేశారు. మనతో పాటు మరింత మంది ని ఇందులో భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞను చేయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టూరిజం ప్రాంతీయ సంచాలకులు వి స్వామి నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, సిపివో ఎల్ అప్పలకొండ, ఇతర శాఖల అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *