Breaking News

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రథమ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అందినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును శఖాధిపతులు స్వయంగా ఫీల్డ్ కి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారని, ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నామని, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతే ఆ ఫిర్యాదును ఆన్లైన్లో క్లోజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వ్యర్ధాలు తొలగింపు, ఇంటి పన్ను, హోటల్ పై ఫిర్యాదు, అనధికారి ఆక్రమణలు, ఆస్థి పన్ను వంటి సమస్యలపై ఫిర్యాదులు అందుకని సత్వర సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పన్ను సంబంధిత నాలుగు ఫిర్యాదులు అందగా, పట్టణ ప్రణాళిక కు మూడు, ఇంజినీరింగ్, ప్రజారోగ్యం సంబంధిత ఒక్క ఫిర్యాదు అందుకున్నారు. మొత్తంగా ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో 9 ఫిర్యాదులు అధికారులు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *