విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారు ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. TET కి 4,27,300 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్షల హాల్ టికెట్లను ఈ నెల 22న విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు తమ టెట్ హాల్ టికెట్లు విద్యాశాఖ వెబ్సైట్లో (http://cse.ap.gov.in ) నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు 2,84,309 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్ టికెట్ల లో ఏవైనా తప్పులు వున్నట్లయితే అవసరమైన ఒరిజనల్ సర్టిఫికెట్లు సమర్పించి పరీక్ష కేంద్రం దగ్గర నామినల్ రోల్స్ లో సరిచేయించుకోవచ్చు . ఇందుకోసం పరీక్షా కేంద్రం దగ్గర అధికారులు ఏర్పాట్లు చేస్తారు. అభ్యర్థులు గతంలో నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం 11, 12 తేదీలు మినహా అక్టోబర్ నెల 3 వ తేదీ నుండి 21 వ తేది వరకు టెట్ పరీక్షలు జరుగుతాయి. ఏదైనా సందేహాలు ఉంటే డైరెక్టరేట్ కమీషనర్ కంట్రోల్ రూమ్ ఈ కింది నెంబర్స్ కి ఉదయం 10am నుండీ సాయంత్రం10pm వరకు కాల్ చేసి సమాధానం తెలుసుకోవచ్చును 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995789286, 9398822554, 7995649286, 9963069286, 9398822618, మరియు సందేహాలను ఈమెయిల్ ద్వారా grievences.tet@apschooledu.in కి పంపవలెను, అని పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ విజయరామరాజు. వి .ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
Tags vijayawada
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News