Breaking News

ఇది మంచి ప్రభుత్వం… ప్రజా సంక్షేమ ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం: వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ
-ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని డివిజన్ లో పక్కాగా నిర్వహించాలి: గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇది మంచి ప్రభుత్వం… ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిందని ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల ముంగిటకు ప్రజావేదిక నిర్వహించి గౌ. ముఖ్యమంత్రి ఇచ్చిన స్పూర్తి, ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ సంయుక్తంగా పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజక వర్గంలో కడగుంట గ్రామం, బాలాయ పల్లి మండలం నందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజావేదికను స్థానిక ఎమ్మెల్యే, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, కడగుంట సర్పంచ్ అంకయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో, ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు. మన రాష్ట్రంలో ఇస్తున్నంత పెద్ద మొత్తంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు దేశంలో ఎక్కడ కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పలు కేటగిరీల కింద పేదలకు ప్రతి నెల ఒకటో తేదీన ఉదయాన్నే సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతోందని, ఈ నెల ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను ఆదివారం ఉందని ఒక రోజు ముందుగానే ఆగస్ట్ 31 ననే అందించి గొప్ప మనసు కలిగిన ప్రజా పాలకుడిగా ఆదర్శంగా మన ముఖ్యమంత్రి నిలిచారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పెన్షన్లు పెంచారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పలు హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చారని అన్నారు. తొలి సంతకం నిరుద్యోగులకు మెగా డిఎస్సీ పై సంతకం చేశారని అన్నారు. మన జిల్లాలో శ్రీసిటీ నందు పలు పరిశ్రమలకు సుమారు రూ.1500 కోట్ల పెట్టుబడులతో శంఖు స్థాపన, ప్రారంభోత్సవాలు ఈ మధ్యనే ముఖ్యమంత్రి చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మన ఏర్పేడు, నాయుడుపేట, చిల్లకూరు మండల ప్రాంతాల్లో పలు పరిశ్రమలు సిఎం గారి ముందు చూపుతో రానున్నాయని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సచివాలయం ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ప్రజల ముంగిటకు ఇంటింటికి వెళ్లి వివరించాలని, ఇది మంచి ప్రభుత్వం ఎందుకు అనేది నూతన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే చేసిన పలు మంచి పనులను ప్రజలకు వివరించాలని, అలాగే మరి ఇంకా ఎంతో సమయం ఉంది కాబట్టి ప్రభుత్వం చేపడుతున్న మరెన్నో మంచి కార్యక్రమాలను వారికి వివరించాలని తెలిపారు.తెలుగు గంగ నీరు ఎమ్మెల్యే గారి చొరవతో ముందుగా విడుదల కావడం తో ఎంతో మంచి జరిగిందనీ అన్నారు. బాలాయపల్లి మండలంలోని ప్రజలు కోరిన మేరకు వారి ఇంటి నిర్మాణాలకు ఇసుకను ఎద్దుల బండితో తీసుకెళ్లడానికి ఎలాంటి ఆక్షేపణ ఉండదని కలెక్టర్ తెలిపారు. విజయవాడ నందు ఏర్పడిన వరదల సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి పది రోజుల పాటు కృషి చేసి బస్సులో ఉంటూ అధికారులను, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించారని, ఆయన స్పూర్తి అందరికీ ఆదర్శం అని అన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం అనేది ప్రజల ముంగిటకు సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన మేలును అమలు చేసిన హామీలు వివరించాలని అన్నారు. ముఖ్యమంత్రి పలు హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించి అండగా నిలుస్తున్నారని, మెగా డిఎస్సీ విడుదల చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు భరోసా అందించారని, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ ల పునరుద్ధరణ, ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, ఒకటో తేదీననే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అని, విజయవాడ నగరం వరదలతో అతలాకుతలం అయి ప్రజలు విలవిల లాడుతున్న సందర్భంలో మన గౌ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 రోజులు నిద్రాహారాలు మాని బస్సు లో ఉండి ప్రజలను ఆదుకున్నారు అని అన్నారు. వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న మన తిరుపతి జిల్లాలోని ప్రజల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వంలోని పలువురు తిరుమల లడ్డు అంశంలో అనేక అవకతవకలకు పాల్పడినారని వాటిపై ముఖ్యమంత్రి తప్పక చర్యలు తీసుకుంటారని తెలిపారు.

గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం డివిజన్ లో విజయవంతం చేయాలని కోరారు.

పలువురు ప్రజలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చాలా మంచి అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నారని ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడారు. అనంతరం ప్రజల నుండి ప్రజా వేదికలో కలెక్టర్, ఎమ్మెల్యే అర్జీలు తీసుకున్నారు.

కార్యక్రమానికి ముందుగా కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కింద ఏర్పాటు చేసిన పోషణ మాసోత్సవాల స్టాల్ ను పరిశీలించి సదరు పౌష్టికాహారాన్ని రచి చూశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించి వారికి చీర పసుపు కుంకుమలు అందచేశారు.

ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ గూడూరు వాణి, బాలయ పల్లి ఇంఛార్జి ఎంపిడిఓ వినీల్ కుమార్, డిప్యూటీ తాసిల్దారు శిరీష, డిఎల్పిఓ వెంకట రమణ, డి ఈ హౌసింగ్ జహీరుద్దీన్ తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *