Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 224 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత గడువు లోగా అర్థవంతంగా పరిష్కరించాలి: డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువు లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జెసి శుభం బన్సల్, డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు చంద్రశేఖర్ నాయుడు, రామ్మోహన్, నరసింహులు తో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు
రెవెన్యూ శాఖ – 144 , పంచాయతీరాజ్ శాఖ -9, డి.ఆర్.డి.ఏ – 12, పోలీస్ శాఖ -7, సర్వే -5, ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ -5, ఎం.ఏ.యు.డి – 7, ట్రైబల్ వెల్ఫేర్ -1, డిసెబిలిటీ -4, విద్యా శాఖ – 2, ఎంప్లాయిమెంట్ -2, ఏ.పి.ఎస్.ఆర్.టి.సి -1, దేవాదాయ శాఖ -3, ఖజానా శాఖ -1, రిజిస్ట్రేషన్ -1, నేషనల్ హై వే -1 , ఇరిగేషన్ -3, మైన్స్ అండ్ జువాలాజీ – 2, పి.డి డ్వామా – 2, ఏ.పి.స్టేట్ వక్ఫ్ బోర్డు – 1, ఐ.సి.డి.ఎస్ – 2, హౌసింగ్ – 1, జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ -3, రుయా -1, సివిల్ సప్లైస్ – 1, మెప్మా -1, ఐ ఎండ్ పి ఆర్ -2 వెరసి మొత్తం 224 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం ఎంతో ఉదారంగా విరాళాలు అందచేసిన అధికారులు, వారి సిబ్బంది అందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *