తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 1వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో యూత్ ఫెస్టివల్ లో నిర్వహించిన 5కె రెడ్ రన్ మారథాన్, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, ప్రైజ్ మనీ చెక్కులను జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మారథాన్ మరియు క్విజ్ ప్రోగ్రాం లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నేడు సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ మరియు చెక్కులు పంపిణీ చేశారు. 5 కె రెడ్ రన్ మారథాన్ పురుషుల విభాగంలో విజేతలుగా నిలిచిన వి.చరణ్ కుమార్ కు మొదటి బహుమతి కింద రూ.7000, రెండవ బహుమతిగా ఎంపికైన జి రాజా కు రూ.4000 చెక్కును అందజేశారు.
అలాగే 5 కె రెడ్ రన్ మారథాన్ స్త్రీ ల విభాగంలో విజేతలుగా నిలిచిన వి కె.సాయి ప్రియ కు మొదటి బహుమతి కింద రూ.7000, రెండవ బహుమతిగా ఎంపికైన జి రజినీ కు రూ.4000 చెక్కును అందజేశారు.
5 కె రెడ్ రన్ మారథాన్ ట్రాన్స్ జెండర్ విభాగంలో విజేతలుగా నిలిచిన ఎం.స్వీటీ కు మొదటి బహుమతి కింద రూ.7000, రెండవ బహుమతిగా ఎంపికైన టి.తేజస్విని కి రూ.4000 చెక్కును అందజేశారు.
రెడ్ రిబ్బన్ క్విజ్ ప్రోగ్రాం లో మొదటి బహుమతిగా ఎంపికైన పదవ తరగతి చదువుతున్న టీం సభ్యులైన ఎస్. చెంచమ్మ(జడ్పీ హైస్కూల్ బండారుపల్లి, ఏర్పేడు మండలం) కు రూ.7000, బి.రాధిక(డాక్టర్ ఎస్ ఆర్ కె ఎం సి హై స్కూల్ తిరుపతి అర్బన్) కు రూ. 3500 చెక్కును అందజేశారు.
రెడ్ రిబ్బన్ క్విజ్ ప్రోగ్రాం లో రెండవ బహుమతిగా ఎంపికైన పదవ, తొమ్మిదవ తరగతి చదువుతున్న టీం సభ్యులు లైన ఎన్. హాసిని(జడ్పీ గర్ల్స్ హైస్కూల్ , రేణిగుంట) కు రూ.5000, ఎం.శశి ప్రియ దర్శిని(ఎం.జి.పి.ఏ.పి.బి.సి గర్ల్స్ స్కూల్) కు రూ. 2500 చెక్కును అందజేశారు.
ఈనెల 1వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో 5 కె రెడ్ రన్ మారథాన్, క్విజ్ ప్రోగ్రాం లను కలిపి యూత్ ఫెస్టివల్ ను జరుకొనడం జరిగిందని అధికారులు కలెక్టర్ కు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు,ఎయిడ్స్ మరియు క్షయ అధికారి శ్రీనివాస రెడ్డి, జిల్లా విద్యా శాఖాధికారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News