Breaking News

స‌ర్వ మ‌త ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ తీసిన జ‌గ‌న్ ను త‌క్ష‌ణం అరెస్ట్ చేయాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-జ‌గన్ కి తెలిసింది ఒక్క‌టే డ‌బ్బు సంపాద‌న
-గ‌త ప్ర‌భుత్వంలో తిరుమ‌ల‌లో తీవ్ర అప‌చారం
-జ‌గ‌న్ ప‌ప్పు కూడా కాదు..ప‌నికిరాని ప‌ప్పు
-తిరుమ‌ల‌ ల‌డ్డు కల్తీ విష‌యంలో వెల్లంప‌ల్లి బాధ్యుడే
-ప్ర‌ధాని మోదీకి జ‌గ‌న్ రాసిన ఉత్త‌రం హాస్య‌స్ప‌దం…
-ఉత్త‌రంలో సిబిఐ విచారణ అంశం ప్ర‌స్తావించ‌ని జ‌గ‌న్
-వ‌ర‌ద‌ల్లో కూడా జ‌గ‌న్ బుర‌ద రాజ‌కీయం
-ఇది మంచి ప్ర‌భుత్వం కార్యక్ర‌మానికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం
-ప్ర‌సాద్ ప‌థ‌కం కింద క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం అభివృద్ధి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జ‌గ‌న్ జీవితం అబ‌ద్దాల మ‌యం.. జ‌గ‌న్ కి తెలిసింది ఒక్క‌టే డ‌బ్బు సంపాద‌న‌. అందుకోసం ఎలాంటి దారుణాల‌కైనా వెన‌కాడ‌డు. ఎవ‌రి మ‌నోభావాలు ప‌ట్టించుకోడు. అందుకే త‌న పాల‌న‌లో క‌లియుగ దైవం తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామి ల‌డ్డు ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించాడు. తిరుప‌తి ల‌డ్డు ప్ర‌సాదాన్ని రాష్ట్రంలో ప్ర‌జ‌లంద‌రూ మ‌తాల‌కీ అతీతంగా క్రైస్త‌వులు, ముస్లిమ్స్ ఇష్ట‌ప‌డ‌తారు. అంద‌రీ మ‌త విశ్వాసాల‌ను దెబ్బ‌తీసి, వారి మ‌నోభావాల‌తో ఆడుకున్న ఎమ్మెల్యే జ‌గ‌న్ ను త‌క్ష‌ణం అరెస్ట్ చేయాల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ కోరారు.

తిరుమ‌ల ల‌డ్డు ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించిన బాధ్యుల‌ను అరెస్ట్ చేయాల‌ని కోరుతూ, ఇది మంచి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల చూపిస్తున్న ఆద‌ర‌ణ తెలిపేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్, మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్, టిడిపి నాయ‌కుల‌తో క‌లిసి గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ జ‌గ‌న్ పాల‌న‌లో అవినీతి తిరుమ‌ల ల‌డ్డు ప్ర‌సాదంలో క‌ల్తీ చేసేంత‌గా శృతి మించింద‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌లో జ‌రగ‌ని అప‌చారం జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగింద‌న్నారు. ప్ర‌ధాన మంత్రి మోదీకి రాసే ఉత్తరంలో సిబిఐ ఎంక్వైయిరీ కోర‌తాన‌న్న జ‌గ‌న్…ఆ విష‌యం ఎందుకు ప్ర‌స్తావించ‌లేదో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. జ‌గ‌న్ రాసిన ఉత్త‌రం చాలా హాస్య‌స్ప‌దంగా వుంద‌న్నారు. త‌ను త‌ప్పు చేయ‌లేద‌ని చెబుతున్న జ‌గ‌న్ ద‌మ్ముంటే సిబిఐ ఎంక్వైయిరీ వేయించుకోని త‌న నిజాయితీ నిరూపించుకోవాల‌న్నారు. ల‌డ్డు క‌ల్తీ విష‌యంలో ఆనాటి దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ కూడా బాధ్యుడేన‌న్నారు.

మ‌తాల‌కు అతీతంగా భ‌క్తుల మ‌నోభావాలు ఎవ‌రైనా గౌర‌వించాలి. కానీ జ‌గ‌న్ మాత్రం తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను కావాల‌నే అప్ర‌తిష్ట పాలుజేశాడ‌ని మండిప‌డ్డారు. భ‌క్తుల‌ మ‌నోభావాలు దెబ్బ‌తీసిన దోషుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్ర‌మే కాదు..ప్ర‌జ‌లు కూడా శిక్షించ‌టానికి సిద్దంగా వున్నార‌ని తెలిపారు. అందుకే కొన్ని ప్ర‌జా సంఘాల‌తో క‌లిసి ప్ర‌జ‌లు జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌ని తెలిపారు.

జ‌గ‌న్ హ‌యంలో తిరుమ‌ల ఆల‌యంలో ల‌డ్డు క‌ల్తీ విష‌యం ఒక్క‌టే కాదు..ఎన్నో అప‌చారాలు, ఘోరాలు జ‌రిగాయి..వాటిన్నింటీని వెలికి తీసి దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌న్నారు. జ‌గ‌న్ హ‌యంలో రాష్ట్రంలో హిందు దేవాల‌యాల‌పై, చ‌ర్చ్ ల‌పై , మ‌జీద్ ల‌పై జ‌రిగిన దాడుల‌పై ఆస్తుల ఆక్ర‌మ‌ణ పై క‌మిటీ వేసి దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌న్నారు. క్లోజ్డ్ రూమ్ లో ప్రెస్ మీట్స్ పెట్టే జ‌గ‌న్ కి ఆలు గ‌డ్డ‌కు ఉల్లి గ‌డ్డ‌కు తేడా తెలియ‌ద‌న్నారు. అలాగే జ‌గ‌న్ ప‌ప్పు కూడా కాదు..ప‌నికిరాని ప‌ప్పు అంటూ ఎద్దేవా చేశారు.

ఇక విజ‌య‌వాడ‌కి జ‌లీల్ ఖాన్ నాయ‌క‌త్వంలో హజ్ హౌస్ తీసుకువ‌స్తే ఒక త‌ట్టెడు మ‌ట్టి కూడా జ‌గ‌న్ వేయ‌లేద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు దృష్టికి ఈవిష‌యం తీసుకువెళ్లి విజ‌య‌వాడ‌లో హజ్ హౌస్ ప్రారంభించేందుకు కృషి చేస్తామ‌న్నారు. ఇక జ‌గ‌న్ మాట‌లు, డ్రామాలు న‌మ్మ‌టానికి ప్ర‌జ‌లు సిద్దంగా లేర‌ని తెలిపారు. జ‌గ‌న్ అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికారం కోసం తాప‌త్ర‌య‌ప‌డుతున్న విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లందరికీ అర్ధ‌మైంద‌న్నారు.

ఇది మంచి ప్ర‌భుత్వం కు బ్ర‌హ్మ‌ర‌థం
వ‌ర‌దల్లో కూడా బుర‌ద రాజ‌కీయం చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ కే చెల్లుతుంద‌న్నారు. ముంపు ప్రాంతాల్లో నీళ్ల‌ల్లోకి దిగ‌కుండా రెండు నిమిషాలు పోటోషూట్ కి పోజులిచ్చి వెళ్లిపోయాడ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ చేసిన ఆకృత్యాలు, అవినీతి చూస్తే రాష్ట్రం సిగ్గుతో త‌ల‌దించుకునే పరిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఎమ్మెల్యే జ‌గ‌న్ వ‌ర‌ద బాధితుల‌కి కోటి రూపాయ‌లు ప్ర‌క‌టించి క‌మిటీ వేశాడు..ఆ క‌మిటీ ఎప్పుడు నిర్ణ‌యిస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి వుంద‌న్నారు..

విజ‌య‌వాడ కి వ‌చ్చిన వ‌ర‌దలు చూసిన రాష్ట్ర ప్ర‌జ‌లు విరాళాల‌ రూపంలో సీఎం రిలీప్ ఫండ్ కు దాదాపు 400 కోట్ల రూపాయ‌లు పంపించ‌టం చూస్తుంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఎంత‌ నమ్మ‌కం, విశ్వాసం పెట్టుకున్నారో అర్ధ‌మ‌వుతుంద‌న్నారు. .

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఎన్డీయే ప్ర‌భుత్వంలో వంద రోజుల పాల‌న పూర్తి అయిన సంద‌ర్బంగా నిర్వ‌హిస్తున్న‌ ఇది మంచి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న వ‌స్తుంద‌న్నారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర‌ద ముంపుకి గురైన‌ 56వ డివిజ‌న్ లో ఇది మంచి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తే ప్ర‌జ‌లు వ‌ర‌ద స‌మ‌యంలో చంద్ర‌బాబు చేసిన స‌హాయ కార్య‌క్ర‌మాలు గుర్తు చేసుకున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌లు స్వ‌చ్ఛదంగా ముందుకి వ‌చ్చి వారి ఇంటికి ఇది మంచి ప్ర‌భుత్వం స్టిక్క‌ర్ వారే అంటించుకుంటున్నార‌న్నారు.

బుడ‌మేర ముంపు కార‌ణంగా న‌ష్ట‌పోయిన బాధితులందరికీ న‌ష్ట‌ప‌రిహారం అందించే విధంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చ‌ర్య‌లు తీసుకోవ‌టం జ‌రిగింద‌న్నారు. వ‌ర‌ద ముంపుకి గురైన బాధితుడు ఏమి కోరుకుంటాడో అదే విధంగా బాధితులందరికీ స‌హాయ చ‌ర్య‌లు వుండే విధంగా చ‌ర్య‌లు తీసుకోవ‌టం జ‌రిగింద‌న్నారు.

వ‌ర‌ద కార‌ణంగా ముంపుకి గురైన ప్ర‌తి ఇంటిని స‌ర్వే చేసి ప్ర‌తి బాధితుడికి న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయ‌బ‌డ్డాయన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొద‌టి సారిగా వ‌ర‌ద బాధితుల్ని ఆదుకునేందుకు వంద‌ర‌కాల కేట‌గిరులు ఏర్పాటు చేసి అంద‌రికీ న‌ష్ట‌ప‌రిహారం వ‌చ్చేలా ఏర్పాటు చేయ‌టం జ‌రిగింద‌న్నారు. వ‌ర‌ద కార‌ణంగా విజ‌య‌వాడ‌లో ముంపుకి గురైన‌ 32 డివిజ‌న్స్ లోని రోడ్లు ,ఇళ్లు బుర‌ద తో నిండిపోతే 300 ఫైరింజ‌న్స్ తో శుభ్ర‌ప‌ర్చ‌టం దేశంలోనే ప్ర‌ప్ర‌ధ‌మన్నారు. వ‌ర‌ద కార‌ణంగా న‌ష్ట‌పోయిన ప్ర‌తి బాధితుడ్ని ఆదుకునే కార్య‌క్ర‌మం దేశ చ‌రిత్ర‌లో మొద‌టిసారిగా సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఆంధ్ర‌రాష్ట్రంలోనే జ‌రుగుతుంద‌న్నారు.

శ‌ర‌వేగంగా ద‌స‌రా ఉత్స‌వ ఏర్పాట్లు
విజ‌య‌వాడలో క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రుల ఉత్స‌వ ఏర్పాట్లు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న‌ట్లు ఓ ప్ర‌శ్న‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ బదులిచ్చారు. మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రితో క‌లిసి ఇంద్ర‌కీలాద్రి పై ద‌స‌రా ఉత్స‌వ పోస్ట‌ర్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. దేవ‌దాయ శాఖ మంత్రి తిరుమ‌లలో వుండ‌టం వ‌ల్ల ఈ ఏర్పాట్లు ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు చెప్పారు.
అలాగే రాష్ట్రంలో తిరుమ‌ల త‌ర్వాత అత్యంత‌ ప్ర‌సిద్దిగాంచిన‌ దేవాల‌యం క‌నక‌దుర్గ‌మ్మ ఆల‌యం..ఈ ఆల‌యం రాష్ట్ర రాజ‌ధాని ప్రాంతంలో వుండ‌టం న‌గ‌ర‌వాసుల‌ అదృష్టం..ద‌స‌రా అనంతరం ఆల‌యాన్ని ప‌రిశీలించి ఆల‌య అబివృద్దికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఆల‌య అభివృద్దికి కేంద్ర ప‌థ‌కం ప్ర‌సాద్ కింద వంద కోట్లు రూపాయ‌లు కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడిగిన‌ట్లు తెలిపారు.

ఈ మీడియా స‌మావేశంలో రాష్ట్ర వాణిజ‌ణ్య‌ విభాగ అధ్య‌క్షుడు డూండీ రాకేష్, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లాహ్‌, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *