విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Ministry of Industry and Commerce, Food Processing కలిసి “వరల్డ్ ఫుడ్ ఇండియా-2024 ఈవెంట్” సెప్టెంబర్ 19 నుంచి 22 తేది వరకు భారత్ మండపం న్యూ ఢిల్లీలో గౌరవ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ గారు మొదటి రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రపంచ దేశాల వారు మరియు రాష్ట్రాల వారు పాల్గొనడం జరిగినది. సెర్ప్ సంస్థ నుండి పి.యం.యఫ్.ఇ విభాగం నుండి, కె.సరళ, అడిషనల్ డైరెక్టర్ మరియు యస్.సుజాత, ఎంటర్ ప్రెన్యూర్ మరియు చిత్తూరు జిల్లా నుండి డి.పి.యం మధుసూదన్ పాల్గొనడం జరిగినది. రెండవ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పి.ఎం.ఎఫ్.ఎం.ఇ స్కీమ్ ద్వారా సీడ్ క్యాపిటల్ మరియు హయ్యర్ ఆర్డర్ క్రింద లోన్ తీసుకొని ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగి, వివిధ ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న మహిళల యొక్క ప్రొడక్ట్ అనకాపల్లి – అనకాపల్లి బెల్లం రుచులు, మాడుగుల హల్వా ఏలూరు – గుడ్ హెల్త్ మిల్లెట్ కుకీస్, అన్నమయ్య – మిల్లెట్ మేజిక్, Dr.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ – వేల్విష్ కొబ్బరి నునే, కొబ్బరి పొడి మరియు పచళ్ళు, కృష్ణ – త్రిపుర కారం,గుంటూరు – ఉమా గోల్డ్ పసుపు, శ్రీ సత్య సాయి – గుడ్ లిఫేస్ వారి ఎనర్జీ ప్రోటీన్ మాల్ట్, విజయనగరం – మామిడి తాండ్ర , విశాఖపట్నం – అంబికా పపడ్స్, పచ్చిమ గోదావరి – భగవాన్ పూతరేకులు మరియు శ్రీకాకుళం- జీడిపప్పు లను “షో కేస్” నందు పెట్టడం జరిగినది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రొడక్ట్స్ కొనుటకు. కెన్యా, వియత్నాం, ఇరాన్ దేశాలు ఆశక్తి కనపరుచుట, ఇతర రాష్ట్రాల వారు అయిన ఒరిస్సా, కేరళ, డెహరా డూన్, సిక్కిం వారు మరియు ఇతరులు ముందుకు రావడం జరిగినదని మీకు తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాము.
Ministry of Industry and Commerce, Food Processing మంత్రి టి.జి. భరత్, ఇండస్ట్రీస్ కమీషనర్ చెరుకూరి శ్రీధర్ IAS వారు ఆంధ్రప్రదేశ్ స్టాల్ ని సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. తదుపరి, బి 2 బి బిజినెస్ భాగముగా ఇతర దేశాలు మరియు రాష్ట్రాల వారు సందర్శించారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, అందులో మన స్వయం సహయక సంఘ మహిళలు పాలుపంచుకోవాలని, అలానే అందరు తమ వ్యాపారాలను సంఘటిత రంగంలోకి మార్చి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్ళాలని అని కోరుకుంటున్నాము.
Prajavartha Online Telugu News