Breaking News

ఈ నెల 25న నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

– ప‌క‌డ్బందీ నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయండి
– పిల్ల‌ల ఆరోగ్యం కోసం నులిపురుగుల‌ను నులిమేద్దాం
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ నెల 25వ తేదీన అల్బెండ‌జోల్ మాత్ర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మానికి సంబంధించిన గోడ ప‌త్రిక‌లు, క‌ర‌ప‌త్రాల‌ను క‌లెక్ట‌ర్ సృజ‌న‌.. డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో క‌లిసి ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సృజ‌న మాట్లాడుతూ నులి పురుగులు ఉన్న పిల్ల‌ల్లో ర‌క్త‌హీన‌త‌, పోష‌కాల లోపం ఏర్ప‌డుతుందని.. ఎక్కువ‌గా అల‌సిపోతార‌ని, క‌డుపునొప్పి, వికారం, వాంతులు, విరేచ‌నాలు వంటివాటితో పాటు బ‌రువు త‌గ్గుతుంద‌న్నారు. వివిధ శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని వివ‌రించారు. అల్బెండ‌జోల్ మాత్ర‌లు తీసుకోవ‌డం ద్వారా ఈ స‌మ‌స్య‌ల బారిన‌ప‌డ‌కుండా చూడొచ్చ‌న్నారు. ఈ నెల 25వ తేదీన 1-19 ఏళ్లలోపు పిల్ల‌లు, కిశోర బాల‌ల‌కు అల్బెండ‌జోల్ మాత్ర‌లు పంపిణీ జ‌రుగుతుంద‌ని.. త‌ల్లిదండ్రులు ఈ విష‌యాన్ని గుర్తించి, త‌మ పిల్ల‌లు మాత్ర‌లు తీసుకునేలా చూడాల‌న్నారు. 1-2 సంవ‌త్స‌రాల చిన్నారుల‌కు సగం మాత్ర (200 మి.గ్రా.), ఆపైన 19 ఏళ్ల వయ‌సు వ‌ర‌కు ఒక మాత్ర (400 మి.గ్రా.) తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, అంగ‌న్‌వాడీ కేంద్రాలు, విద్యా సంస్థ‌ల్లో గోడ‌ప‌త్రిక‌ల ద్వారా నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మంపై అవ‌గాహ‌న క‌ల్పించి.. పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల‌లు, ఐటీఐ, పాలిటెక్నిక్‌, న‌ర్సింగ్ త‌దిత‌ర విద్యార్థుల‌కు నులి పురుగుల మాత్ర‌ల‌ను ఉచితంగా పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో డీఎల్ఏటీవో డా. జె.ఉషారాణి, ఆర్‌బీఎస్‌కే పీవో డా. మాధ‌వి నాయుడు, డీసీహెచ్ఎస్ డా. బీసీకే నాయ‌క్‌, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *