విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఎకనామిక్స్ విభాగంలో “ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో హస్తకళల ఆర్థిక విశ్లేషణ” అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించిన డాక్టర్ వి. శ్రీరామ్ నరేంద్ర కు వర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు పరిశోధన విభాగపు కోఆర్డినేటర్ డాక్టర్ పి సుధాకర్ తెలిపారు. పరిశోధన పర్యవేక్షకులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కడిమి మధుబాబు వ్యవహరించారని చెప్పారు. వి. శ్రీరామ్ నరేంద్ర చేపట్టిన అధ్యయనంలో హస్తకళల రంగంలో ఆర్థిక అవకాశాల వివరణాత్మక విశ్లేషణ,,- కళాకారుల ఎదుర్కొంటున్న సవాళ్ల గుర్తింపు,- కృష్ణా జిల్లాలో హస్తకళల ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల అంచనా. తదితర అంశాలపై ప్రయోజనకరమైన ఫలితాలను అందించారు. అలాగే కోవిడ్-19 మహమ్మారి హస్తకళల రంగంపై చూపిన ప్రభావాన్ని కూడా ఈ పరిశోధనలో విశ్లేషించారు. లాక్‌డౌన్ కారణంగా హస్తకళా కార్మికుల ఆదాయం, ఉపాధి అవకాశాలు తగ్గడం, మార్కెట్ డిమాండ్ పడిపోవడం వంటి అంశాలపై వివరణాత్మక అధ్యయనం చేశారు ఈ సందర్భంగా ఎకనామిక్స్ విభాగ అధ్యాపకులు, పరిశోధకులు శ్రీరామ్ నరేంద్రను అభినందించారు.
Prajavartha Online Telugu News