Breaking News

సీఎం చంద్రబాబు కి ధన్యవాదాలు

-ఫరూక్ షిబ్లీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ మైనార్టీల హామీలను త్వరగా అమలుకై వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలాగే పెద్దలు మైనారిటీ & న్యాయ మంత్రి  NMD ఫరూక్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. నిన్న సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మైనార్టీల సమీక్ష సమావేశంలో ఇమామ్, మౌజ్జన్ గౌరవ వేతనం క్రింద 10వేలు, 5వేలు, అలాగే మసీదుల నిర్వహణ కొరకు 5వేలు, హజ్ యాత్రకు వెళ్లే వారికి లక్ష రూపాయల సహాయం ఇచ్చే కార్యక్రమాలను త్వరగా అమల్లోకి తేవాలని, టిడిపి ప్రభుత్వంలో మంజూరైన కొంతమేర నిర్మాణాలు జరిగిన కడప హజ్ షాదిహానాలు ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని, మైనార్టీలకు లబ్ది జరిగేలా వక్ఫ్ భూముల అభివృద్ధి కొరకు 2సం||లలో వక్ఫ్ భూములు సర్వే పూర్తి కావాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం మైనార్టీలకు సీఎం తీపి కబురు ఇవ్వటమేనని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు షిబ్లీ అన్నారు. అలాగే వక్ఫ్ బోర్డు అభివృద్ధిలో ఆ వర్గానికి చెందిన వారే భాగస్వాములుగా ఉండేలా చూడాలని ప్రభుత్వ శాఖలు మత కార్యక్రమాల్లో అనవసర జోక్యం చేసుకోకుండా పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం హర్షణీయం అని అన్నారు. అలాగే గత ప్రభుత్వ హయంలో హజ్ యాత్రకు వెళ్లిన వారికి రావలసిన సబ్సిడీ అమౌంట్ కూడా త్వరగా పెద్ద మనస్సు చేసుకొని విడుదల చెయ్యాలని సీఎం కి విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *