Breaking News

జిల్లావాసుల సుదీర్ఘ కాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నంలో వైద్య కళాశాల ఏర్పాటు చేసి తూర్పు కృష్ణాజిల్లా వాసుల సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ప్రజలందరి తరుపున తానూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం మచిలీపట్నం కరగ్రహారం రోడ్డులో వ్యవసాయ పరిశోధన క్షేత్రం వద్ద 62 ఎకరాలలో నిర్మిస్తున్న వైస్సార్ జగనన్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఆసుపత్రి భవన సముదాయంలో ఇన్ పేషేంట్ 3 బ్లాకులు నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఈ వైద్య కళాశాల ఏర్పాటుతో తూర్పు కృష్ణాలో గుడివాడ , పెడన, గుడ్లవల్లేరు, దివిసీమ, బంటుమిల్లి, కృత్తివెన్ను, కైకలూరు, కలిదిండి తదితర ప్రాంత వాసులకు ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది వచ్చినా హడావిడిగా వ్యయప్రయాసలకు ఓర్చి విజయవాడకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని వివరించారు. ఈ అవసరతను మెడికల్ కళాశాల ఆవశ్యకతను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఈ విషయమై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ప్రాధమికంగా యోచించిన మూడు వైద్య కళాశాలల తక్షణం ఏర్పాటు చేయాలని యోచించారని తెలిపారు. ఆ విషయమై ప్రధానమంత్రి మోడీ వద్దకు వెళ్లి ప్రజావైద్యం పట్ల సహకరించాలని ముఖ్యమంత్రి కోరారన్నారు. ఆ విధంగా మంజూరైన మూడు కళాశాలలో మచిలీపట్నం మెడికల్ కళాశాల ఒకటని, రూ.550 కోట్లతో 150 పడకల మెడికల్ కళాశాల మంజూరైన సంగతిని మంత్రి చెబుతూ , ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి మచిలీపట్నంపై ప్రేమాభిమానాలకు ఒక చక్కని నిదర్శమన్నారు. తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కళాశాల చొప్పున గత నెల వర్చువల్ ప్రక్రియలోముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన ఆరు దశాబ్దాల కాలంలో 11 మెడికల్ కళాశాలలు ఏర్పడితే, జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండేళ్ల కాలంలో 16 మెడికట్లో కాలేజీలు మంజూరు కావడం ఆయన చిత్తశుద్ధికి తార్కాణం అన్నారు. కాగా నేడు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రా సృక్టర్లు ప్రాజెక్ట్ ఈ మెడికల్ కళాశాలను 24 నెలల వ్యవధిలో నిర్మించనున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాల పూర్తయితే హ్యూమన్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఇమ్యునాలజీ, ప్రసూతి వైద్యం (ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ), ఎనస్తీషియాలజీ, అంతర్గత వైద్యం (ఇంటర్నల్ మెడిసిన్), కుటుంబ వైద్యం, శస్త్రచికిత్స (సర్జరీ), జెనిటిక్స్, పాథాలజీ (రోగ నిర్ధారక శాస్త్రం) తదితర సబ్జక్ట్స్ లో భోదన కళాశాలకు గుండె, కన్ను, ముక్కు, చెవి, చర్మం, మెదడు, మానసిక ప్రవృత్తి వంటి విభాగాల్లో నిపుణులైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు అందుబాటులో ఉంటారు. ప్రాథమిక శాస్త్రం, పారా క్లినిక్, క్లినిక్ విభాగాలు, పెద్ద స్థాయి ఆధునిక చికిత్సా విభాగాలు అనుభవ్జ్ణులైన నిపుణులతో మచిలీపట్నం వైద్య కళాశాల వైద్యవిద్యకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, లాబొరేటరీ టెక్నాలజీ వంటి కోర్సులు రానున్నాయని, వైద్య కళాశాల ఏర్పాటుతో దానికి అనుబంధంగా ప్రభుత్వ అసుపత్రి ద్వారా అందనున్న మరింత మెరుగైన వైద్య సదుపాయం ఉంటుందని మంత్రి పేర్ని నాని తెలిపారు
ఈ కార్యక్రమంలో బందరు మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మచిలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, రాష్ట్ర గిడ్డంగుల శాఖ మాజీ ఛైర్మెన్ బూరగడ్డ రమేష్ నాయిడు, మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రా సృక్టర్లు ప్రాజెక్ట్ సైట్ ఇంచార్జ్ టి.వి. జగదీష్ ,ఎస్ ఇ అమరేశ్వరరావు, వివిధ డివిజన్లకు సంబంధించి పలువురు కార్పొరేటర్లు, ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.

Check Also

నీతి ఆయోగ్ సీఈఓను క‌లిసిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *