మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి వై .లక్ష్మణరావును జిల్లా కలెక్టర్ జె.నివాస్ మర్యాదపూర్వకంగా ప్రధాన జిల్లా న్యాయస్థానంలో కలుసుకున్నారు. కృష్ణాజిల్లాకు నూతన జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం మధ్యాహ్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఆయన ఛాంబర్ లో కలుసుకుని పుష్పగుచ్ఛాన్ని అందించారు.
