Breaking News

అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని మెడల్స్ తెచ్చే విధంగా శిక్షణ ఇవ్వాలి

-స్పోర్ట్స్ సిబ్బందికి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని మెడల్స్ తెచ్చే విధంగా విద్యార్థులకు శిక్షణ కల్పించాలని అందుకు తగు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పోర్ట్స్ సిబ్బందితో అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో తమ చాంబర్లో విఎంసి స్పోర్ట్స్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని స్పోర్ట్స్ స్టేడియంలు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, నందు విద్యార్థులకు ప్రజలకు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ వచ్చేలా శిక్షణ కల్పించేందుకు కావలసిన అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే మరమతులన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్ సిబ్బంది నుంచి వచ్చిన వినుపమును త్వరగా స్పందించి తురతిగతిన మరమ్మతులని పూర్తి చేసి వాళ్ళకి అప్పగించవలసిందిగా ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ టి శ్రీనివాస్, సూపరిండెండింగ్ ఇంజనీర్లు రామ్మోహన్, శ్రీరామచంద్రమూర్తి, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోగల అన్ని జిమ్ కోచ్ లు, స్విమ్మింగ్ కోచ్ లు, స్టేడియం ఇన్చార్జిలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *