విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న జరుపుకుంటున్న నేపథ్యంలో మరియు స్టెల్లా కళాశాలలో ఈ రోజు పోస్టర్ మేకింగ్, పెయింటి గా మరియు ఎలొక్యూషన్ కాంపిటీషన్ ను నిర్వహించారు. వివిధ పర్యాటక ప్రదేశాలు, మరియు పర్యాటక రంగ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు ఈ విధం గా తోడ్పడుతుంది తెలియపరచి అంశాలు తో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు చరిత్ర విభాగాధిపతి డాక్టర్ బ్యూల నోయల్ తెలిపారు. 30 మంది విద్యార్థినులు పర్యాటక రంగ ప్రాధాన్యత ను తెలియపరచి అనేక అంశాలలో పెయింటింగ్ పోస్టర్ లు తయారుచేశారు. ఈ పోటీలకు డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ గ్.ఉష కుమారి, డాక్టర్ మంగా దేవి తెలుగు విభాగాధిపతి, మరియు ఎలాక్యుషన్, వకృత్వ పోటీలకు స్వప్న వున్నాం ఇంటర్ వైస్ ప్రిన్సిపల్ మరియు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ స్వరూప రాణి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్య క్రమంలో చరిత్ర విభాగాధిపతి డాక్టర్ బ్యూలా, అధ్యాపకులు కెప్టెన్ శైలజ,అంజనీ సింహ, మాధవి, హిస్టరీ మరియు టూరిజం స్టూడెంట్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News