Breaking News

వ్య‌వ‌సాయ, అనుబంధ రంగాలు.. ఆహార భ‌ద్ర‌త‌కు, ఆర్థిక వృద్ధికి చోద‌క‌శ‌క్తులు

– ఈ రంగాల‌పై స్వ‌ర్ణాంధ్ర‌-2047 దార్శ‌నిక ప‌త్రం ప్ర‌త్యేక దృష్టి
– భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో మేధోమ‌థ‌న స‌ద‌స్సులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్థిక‌, సామాజిక అభివృద్ధిపై దృష్టిసారిస్తూ 2047 నాటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా భార‌త్‌కు ఓ కీల‌క వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌ర్ణాంధ్ర @ 2047 దార్శ‌నిక‌త ప‌త్రాన్ని రూపొందిస్తోంద‌ని.. ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాలంటూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేర‌కు, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న మార్గ‌నిర్దేశ‌నంతో వివిధ భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో మేధోమ‌థ‌న స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నట్లు సీపీవో వై.శ్రీల‌త తెలిపారు.
గురువారం ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో సీపీవో ఆధ్వ‌ర్యంలో వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్ర‌తినిధుల‌తో స‌ద‌స్సు జ‌రిగింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క స్వ‌ర్ణాంధ్ర@2047 విజ‌న్ డాక్యుమెంట్ కు సంబంధించి ప్ర‌జ‌ల‌తో పాటు వివిధ భాగ‌స్వామ్య ప‌క్షాల నుంచి సూచ‌న‌లు, స‌ల‌హాలు, స్పంద‌న‌ను తీసుకోవ‌డం జ‌రుగుతోంది. ఇందులో భాగంగా కీలకమైన వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. స్వ‌ర్ణాంధ్ర‌@2047 దార్శ‌నిక ప‌త్రం ఔన్న‌త్యాన్ని అధికారులు వివ‌రించారు. అధిక విలువ క‌లిగిన వ్య‌వ‌సాయ‌, ఆహార శుద్ధి ప‌వ‌ర్ హౌస్‌గా మార్చ‌డం, స్థిర‌మైన వృద్ధితో కూడిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌, సుస్థిర ప్ర‌భుత్వం-డిజిట‌ల్ సూప‌రిపాల‌న, వాతావ‌ర‌ణ ప్రాధాన్య‌త‌గా అభివృద్ధి విధానం, సాంకేతిక‌త‌తో కూడిన అందుబాటులో వైద్యం, నైపుణ్యం పెంపుద‌ల త‌దిత‌ర అంశాలు ప్రాధాన్య‌త‌గా దార్శ‌నిక ప‌త్రం రూపొందుతోంద‌ని వివ‌రించారు. అక్టోబర్ 5వ తేదీ వరకు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి
https://swarnandhra.ap.gov.in/BwgFEAAYgAQyCggGEC4YsQMY/Public%20Consultation%20Survey
లింక్ ద్వారా త‌మ సూచ‌న‌లు, అభిప్రాయాల‌ను పంచుకోవ‌చ్చ‌న్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి ప్రోత్సాహం, పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధి, స‌మృద్ధి మ‌త్స్య సంప‌ద, రైతుల క్షేమం, సంక్షేమానికి అమ‌ల‌వుతున్న కీల‌క కార్య‌క్ర‌మాలు, అమ‌ల‌వుతున్న‌ చ‌ట్టాలు త‌దిత‌రాల‌పై స‌ద‌స్సులో చ‌ర్చించారు. రైతు సంఘాల ప్ర‌తినిధుల అభిప్రాయాల‌ను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు స్వర్ణాంధ్ర@ 2047 పోస్టర్లను ఆవిష్కరించారు.
కార్య‌క్ర‌మంలో జిల్లా వ్య‌వ‌సాయ అధికారి ఎస్‌.నాగ‌మ‌ణెమ్మ‌, ప‌శుసంవ‌ర్థ‌క శాఖ జేడీ డా. హ‌నుమంత‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *