Breaking News

డివిజన్ పరిధిలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సాంకేతిక శిక్షణా సదస్సు

-ప్రస్తుత ఖరీఫ్ సీజన్ తాత్కాలిక సేకరణ లక్ష్యం 2.30 లక్షల మెట్రిక్ టన్నులు
-జిల్లా వ్యాప్తంగా 220 రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు
-గత ఖరీఫ్ కంటే క్వింటాల్ కు రూ.117 లు అధిక ధర చెల్లింపు
-జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో సమన్వయ శాఖల దిశా నిర్దేశనం
-ఆర్ ఎస్ కె వారీగా గన్ని బ్యాగుల కేటాయింపులు పూర్తి
-శిక్షణాకార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి
-జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 220 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు.

శుక్రవారం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం లో రాజమహేంద్రవరం డివిజన్ పరిధి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు సాంకేతిక శిక్షణా, అవగాహనా సదస్సు కు ముఖ్య అతిథిగా జెసి చిన్న రాముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ సంధర్భంలో విశ్లేషణ, నాణ్యత ప్రమాణాలు విషయములో హేతుబద్ధత పాటించాలన్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే రైతుల వారీగా మిల్లులకు ట్యాగ్ చెయ్యడం జరిగిందన్నారు. ఈ పంట నమోదు చేసినట్లు అందుకు అనుగుణంగా ఈ క్రాప్ బుకింగ్ చేపట్టనున్నట్లు జెసి చిన్న రాముడు తెలిపారు.
తేమ శాతం 17 శాతం మించకుండా చూసుకోవా లన్నారు. అందుకు అరబట్టే ప్రక్రియ విధానాలని సమయానుకూలంగా ఆచరించా లన్నారు. ధాన్యం విశ్లేషణ , నాణ్యత ప్రమాణాలు విషయములో మట్టి ఒక శాతం , గడ్డి – చెత్త ఒక శాతం , చెడిపోయిన రంగుమారిన 5 శాతం , పరిపక్వం, ముడుచుకునే 3 శాతం ఉండవొచ్చు అన్నారు. క్వింటాల్ కు కామన్ వెరైటీ రూ.2300 , గ్రేడ్ – ఏ వైరటి రు.2320 ల మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని, గత ఏడాది కంటే రూ 117 లు అధికంగా పెంచడం జరిగిందన్నారు. గ్రామ స్థాయి లో వ్యవసాయ సహాయకులు, సాంకేతిక సహాయకులు క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన బాధ్యత పై శిక్షణా తరగతులను నిర్వహించినట్లు తెలిపారు. రాజమండ్రీ డివిజన్ పరిధిలో 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో రాజమండ్రీ రూరల్ నియోజక వర్గంలో 10 , రాజానగరం నియోజకవర్గంలో 43 , అనపర్తి నియోజకవర్గం లో 28 , గోకవరం మండలం లో 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెరసి 94 రైతు సేవా కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రీ డివిజన్ పరిధిలో ఇందుకోసం 94 మంది టెక్నికల్ సహాయకులు 94 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించడం జరిగిందన్నారు. రైతు వారీగా ఆధార్ కార్డు వివరాలతో గ్రామ వ్యవసాయ సహాయకులు క్రాప్ బుకింగ్ , కోత చేపట్టే షెడ్యూలు , బహిరంగ మార్కెట్ లో అమ్మకాలు, ఆర్ ఎస్ కె కేంద్రానికి వొచ్చే ధాన్యం వివరాలు నమోదు చేయాలన్నారు. సాంకేతిక సహాయకులు ఆర్ ఎస్ కె వారీగా క్రాప్ బుకింగ్, షెడ్యూల్ వివరాలు నమోదు లతో పాటుగా గన్ని బ్యాగులు, లేబర్ , రవాణా వ్యవస్థ కు సంబంధించిన డేటా ఎంట్రీ లని చేపట్టాల్సి ఉంటుందన్నారు. తదుపరి ట్రక్కు షీట్ జనరేట్ చేయాలన్నారు. ప్రతి వాహనానికి జియో ట్యాగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి వాహనాల కదలికలను పర్యవేక్షణ చేయాలన్నారు.

పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి. రాధిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ , అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లాలో మొత్తం 220 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సిద్దం చేసినట్లు తెలిపారు. అక్టోబర్ చివరి వారంలో ధాన్యం కొనుగోలు, సేకరణ కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు.

ఈ శిక్షణా, అవగాహాన కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఆర్ శ్రీరాములు నాయుడు, జిల్లా మేనేజర్ (పౌర సరఫరాల) టి. రాధిక, ఇంచార్జీ జిల్లా పౌర సరఫరాల అధికారి ఎమ్. నాగంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఏ ఎస్ వో జి. త్రినాధ్, మండల స్థాయి అధికారులు, మండల, గ్రామ వ్యవసాయ, పౌర సరఫరాల, రెవెన్యు అధికారులు, సిబ్బంది  , ఆర్ ఎస్ కె సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *