గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బి.కాం క్వాలిఫైడ్ అభ్యర్ధులు 20 మందికి గుంటూరు నగరపాలక సంస్థ వార్డ్ సచివాలయాల్లో సూపర్ న్యూమరీ పోస్ట్ ల్లో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శులుగా అపాయింట్మెంట్ ఉత్తర్వులు అందించామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో అభ్యర్ధులకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బి.కాం అర్హత కలిగి, వార్డ్ సచివాలయ కార్యదర్శుల పోటీ పరీక్షల్లో ఉతీర్ణులై పోస్ట్ లు దక్కని వారికి ప్రత్యేకంగా సూపర్ న్యూమరీ పోస్ట్ లు సృష్టించి పోస్టింగ్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అందులో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థకు 34 పోస్ట్ లు మంజూరు చేసిందని, 20 మంది అభ్యర్ధులు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు హాజరయ్యారని తెలిపారు. సోమవారం వారికి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శులుగా అపాయింట్మెంట్ ఉత్తర్వులు అందుకున్న వారు ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, డి.శ్రీనివాసరావు, మేనేజర్ ప్రసాద్, ఉపా సెల్ పిఓ వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News