విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా మహోత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వివిధ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 726 మంది మొదటి రోజు వివిధ ప్రాంతాలలో క్యూలైన్లను నియంత్రణ, మంచినీటి సరఫరా, వికలాంగుల సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, భోజనాలు వితరణలో సహాయం మరియు ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లో సేవలు అందించినట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దసరా ఉత్సవాలలో మొదటి రోజు మూడు విడతలుగా డ్యూటీలు వేసినట్లు ఒక్కొక్క బ్యాచ్ కి 250 మందిని కేటాయించినట్లు పోలీసు బందోబస్తు సేవలో ఉత్సాహంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పని చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లను సమన్వయం చేయడానికి సైబర్ క్రైమ్ సీఐ శ్రీ జానకి రామయ్య గారు మరియు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల వ్యాయామ భాగాధిపతి డాక్టర్ యుగంధర్, వివిధ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News