-విద్యార్థినీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపధ్యంలో విచారణ
-విచారణ నివేదిక ఆధారంగా సస్ప్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ
-కలెక్టరు పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం రూరల్,జెడ్పీ హైస్కూల్, హుకుంపేట, స్కూల్ అసిస్టెంట్ (గణితం), ఎం. వెంకటేశ్వరరావు జడ్పీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి మరో చిన్నారిని శిక్షించిన ఫిర్యాదుల నేపధ్యంలో ముగ్గురు అధికారులతో విచారణ చేపట్టడం జరిగిందనీ , విచారణ నివేదికను అనుసరించి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సదరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నారు.
ఆ మేరకు హుకుంపేట జెడ్పీ హై స్కూల్ కి చెందిన స్కూల్ అసిస్టెంట్ (గణితం), ఎం. వెంకటేశ్వరరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగిందని జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ఉల్లంఘన, 1964 ను అనుసరించి స్కూలు అసిస్టెంట్ ఎమ్ . వెంకటేశ్వరరావు ను క్రమశిక్షణ చర్యల మేరకు రూల్ 20 ప్రకారం చేసిన ఆరోపణ A.P. సివిల్ సర్వీసెస్ (CC & A) రూల్స్, 1991-సస్పెన్షన్ – ఆర్డర్లు – జారీ చేయటం జరిగిందన్నారు
Prajavartha Online Telugu News