-ఎం.పి. దగ్గుబాటి పురందేశ్వరి
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ విలువలను భావితరాలకు తెలిసే విధంగా స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం అని పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. గురువారం రాజానగరం గైట్ కళాశాల ఆవరణలో ఎయిర్ కమోడోర్ వి ఎమ్ రెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు (NCC (AP&T) SNIC) కార్యక్రమానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ భారతదేశ వైవిధ్యం , భిన్నత్వంలో ఏకత్వం అనే అంశాలను భవిష్యత్తు తరాలకు అందించాలని ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు తుఫాను వరదలు వంటివి ఏర్పడిన సమయంలో ఎన్ సిసి బృందాలు తమ వంతు కర్తవ్యంగా బాధ్యతతో వ్యవహరించడమే కాకుండా వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలను రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి అండగా ఉంటారని తెలిపారు. ఇటీవల విజయవాడలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్ సిసి బృందాలు వెళ్లి వరద ముంపులో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ కార్యక్రమాల్లో అందచేయడం మనం చూసామన్నారు. ఎన్ సీసీ శిక్షణ పొందిన వారందరూ మంచి క్రమశిక్షణతో ఉత్తమ లక్ష్యాలు కలిగిన భారత పౌరులుగా ఎదుగుతారని ఆమె పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఎన్ సిసి పట్ల కొంత ఆదరణ తగ్గుతుందన్నారు. ప్రతి ఏడాది ఇటువంటి క్యాంపులు నిర్వహించుకోవడం జరుగుతుందని, అదే తరహాలో గైట్ సహకారంతో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నానన్నారు. నేడు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయన్నారు. భారతదేశంలో సామాజిక విభజన తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని వాటిని ఎదుర్కొనే విధంగా జాతీయ భావన కలిగి విధంగా పిల్లల్లో ఎన్ సిసి శిక్షణా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. ఇందుకు పిల్లల తల్లి తండ్రులు, పాఠశాలలు, కళాశాలలు అధ్యాపకులు విద్యార్థులను ఎన్ సిసి క్యాడర్ శిక్షణకు చేర్పించే విధంగా సహకరించాలన్నారు. పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రతి పాఠశాల కళాశాల అందిపుచ్చుకోవాలని పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి కోరారు.
ఈ కార్యక్రమంలో కలనల్ ఆర్. యం. అగర్వాల్, కాకినాడ డిప్యూటి డైరెక్టర్ జనరల్, ఎయిర్ కమోడోర్ వి ఎమ్ రెడ్డి, చైతన్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ శాసనమండలి సభ్యులు మాజీ విప్, కె. వి. వి. సత్యనారాయణ రాజు, చైతన్య రాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News