-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన 200 అర్జీలను నిర్దేశించిన గడువులోగా అర్థవంతంగా పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులకు సూచించారు.
సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు నరసింహులు, దేవేంద్ర రెడ్డి, రామ్మోహన్ లతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు
రెవెన్యూ శాఖ – 136, పంచాయతీరాజ్ శాఖ -07, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ -01, వైద్య ఆరోగ్యశాఖ- 3, పోలీస్ శాఖ -8, సెర్ఫ్ – 10, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ -8, స్కిల్ డెవలప్మెంట్ -4, స్కూల్ ఎడ్యుకేషన్ – 1, వికలాంగులు వయో వృద్దులు శాఖ -2, ఎంఏ యూడి – 6, ఎస్.సి కో- ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ – 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు -1, డ్వామా -2, ఐ సి డి ఎస్ – 2, సమగ్ర శిక్ష అభియాన్ -2, హౌసింగ్ -2, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ -1, సోషల్ వెల్ఫేర్ -2, అటవీశాఖ -1 వెరసి మొత్తం 200 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు.
Prajavartha Online Telugu News