Breaking News

అర్జీలు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే ఫిర్యాదులు, అర్జీలు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఇంచార్జి) డి.శ్రీనివాస్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ (ఇంచార్జి) పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (ఇంచార్జి) ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడవులోగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులకు ఇచ్చే ఎండార్స్మెంట్ ను ఆయా విభాగాధిపతులు పరిశీలించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు 34 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 13, ఇంజినీరింగ్ విభాగం 11, రెవెన్యూ విభాగం 3, ప్రజారోగ్య విభాగం 5, అకౌంట్స్ విభాగం 1, ఉపా సెల్ కి సంబందించి 1 ఫిర్యాదు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ రవి, మేనేజర్ ప్రసాద్, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, డిసిపిలు, ఆర్ఓలు , యస్.యస్ లు, సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *