Breaking News

ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల పై నిర్మాణాలు చేయకుండా, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబందనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కోదండరామయ్య నగర్, గోరంట్ల, పెద్ద పలకలూరు రోడ్, కాకాని రోడ్, ఆర్టీసి కాలని తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్ ల కొలతలు, ర్యాంప్ లు, డ్రైన్ల పై ఆక్రమణలను తనిఖీ చేసి, తదుపరి అనుమతులకు సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబందనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. భవనాలు నిర్మాణ దశలో వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పరిశీలిస్తూ, నిబందనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి, నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆర్టీసి కాలనిలో డ్రైన్ ని ఆక్రమించి ర్యాంప్ లు చేసిన నిర్మాణం గమనించి సంబందిత ప్లానింగ్ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే నిర్మాణం చేసిన వాటిని తొలగించాలని స్పష్టం చేశారు. ప్రదానంగా సెట్ బ్యాక్ పోర్షన్ లో ఏ విధమైన నిర్మాణాలు చేయకూడదని, జనరేటర్లు కూడా పెట్టడానికి వీలు లేదన్నారు. ర్యాంప్ లు రోడ్ మీద వరకు రాకూడదని, గ్రీనరీకి కేటాయించిన విధంగా ఉండాలన్నారు. వాచ్ మెన్ రూమ్ నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. అపార్ట్మెంట్ నిర్వాహకులే డ్రైనేజి లైన్ ను మేజర్ డ్రైన్ వరకు కనెక్ట్ చేసుకోవాలన్నారు.
పర్యటనలో సిటి ప్లానర్ డి.రాంబాబు, టిపిఎస్ లు లక్ష్మణ స్వామి, సువర్ణ కుమార్, రసూల్, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *