Breaking News

విద్యార్థుల శాస్త్రవంతమైన అభివృద్ధిలో భాగంగా కావాలి : జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులను శాస్త్రవంతమైన అభివృద్ధిలో భాగంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నందు నిర్వహించిన 2024 ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రవంతమైన అభివృద్ధిలో భాగంగా ఉండాలని, “అంతరిక్షం & వాతావరణ మార్పు” గురించి సానుకూలంగా స్వీకరించాలని, ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని విద్యార్థుల కు చూచించారు. ఇక్కడ ఉన్న యువతను చూసి యువ మనసులతో మాట్లాడడం ఎల్లప్పుడూ, కొత్తగా ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు. మీరు మన దేశ భవిష్యత్, రాబోయే కాలంలో మీరే దేశాన్ని నడిపించాబోయే పౌరులన్నారు. ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో జరుపుకుంటుందని, ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం చాల సంతోషమన్నారు.

SHAR యూనిట్ సమ్మిట్ 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు రెండు రోజుల పాటు పోటీలను నిర్వహించడం జరుగుతుందని, UG / PG విద్యార్థుల కోసం క్విజ్, పోస్టర్ పెయింటింగ్ పోటీలు, ఎలోక్యూషన్ UG / PG కోసం, మోడల్స్ పోటీ. విద్యార్థులు పోటీలలో సక్రమంగా పాల్గొనాలని మరియు మన దేశం యొక్క అభివృద్ధి కొరకు భవిష్యత్తు తరపు అభ్యున్నతి కోసం ముఖ్య పాత్ర పోషించాలని, విద్యార్థులను శాస్త్రవంతమైన అభివృద్ధిలో భాగంగా ఉండాలని అన్నారు. అనంతరం అంతరిక్ష ప్రదర్శన, స్పేస్ ఆన్ వీల్స్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి సందర్శించారు.

ఈ కార్యక్రమంలో ISRO  పి.సునిల్, Dy.Director, System Reliability, SDSC SHAR మరియు  NNN మూర్తి, జనరల్ మేనేజర్, VALF, SDSC SHAR, కళాశాల యాజమాన్యం N.సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపల్, SVCE, తిరుపతి & డాక్టర్ D. శ్రీనివాసులు రెడ్డి, ప్రొఫెసర్ & హెచ్.ఓ.డీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ECE, SVCE విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *