Breaking News

ఎలాంటి పొరపాట్లు లేకుండా హేతుబద్ధంగా భూ సర్వే చేపట్టాలి : డాక్టర్ వెంకటేశ్వ ర్

-పి జి ఆర్ ఎస్ మరియు భూ సమస్యలను ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని రెవెన్యూ సిబ్బంది అత్యంత నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలి : జాయింట్ కలెక్టర్ శుభం భన్సాల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ లో వచే బు సమస్యల అర్జీలు రీ ఓపెన్ కాకుండా అత్యంత నాణ్యత తో పరిష్కారం చేయాలని డాక్టర్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వ ర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలసి భూ సమస్యలు, భూ సర్వే కి సంబంధించి పీజీఆర్ఎస్ లో వచ్చు అర్జీలు పై ఆర్ డి లు, జిల్లా ల్యాండ్,భూ రికార్డ్స్ ఏ డి, మండల తహశీల్దార్లు, మండల సర్వేయర్ల, డిప్యూటీ తహశీల్దార్లు,వి ఆర్ ఓ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ లో వచే బు సమస్యల అర్జీలు రీ ఓపెన్ కాకుండా అత్యంత నాణ్యత తో పరిష్కారం చేయాలని, జిల్లాలో ఉన్నటువంటి భూ సమస్యలపై రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలని, అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని తెలిపారు. మండల స్థాయిలో తహశీల్దార్ల తోపాటు క్రింది స్థాయి రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా భూ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత ఆర్డీవో లను, తహశీల్దార్లను, మండల సర్వేయర్ల, విఆర్ ఓ లను ఆదేశించారు. పి జి ఆర్ ఎస్ మరియు భూములకు సంబంధించిన అంశాలను ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని సత్వరమే అత్యంత నాణ్యతతో పరిష్కారం చూపాలన్నారు. తహశీల్దార్లు మండల పరిధిలో క్షేత్ర స్థాయిలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు, కోర్టు కేసులు, లోకాయుక్త, ఆర్. టీ.ఐ, డిసిప్లినరీ కేసులు, ఆర్. ఓ.ఆర్ తదితర అంశాలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డి ఆర్ ఓ.పెంచల కిశోర్,ఆర్ డి ఓ లు, జిల్లా ల్యాండ్ అండ్ భూ రికార్డుల ఏ డి,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *