Breaking News

మూల నక్షత్రం రోజు ప్రజలకు మరింత సౌకర్యాలను కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం శాఖధిపతులతో, దసరా నవరాత్రుల ఏర్పాట్లలో ఫీల్డ్ వర్క్ లో ఉన్న అధికారులతో టెలికాన్ఫెరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా మూల నక్షత్రం రోజు అమ్మవారి దర్శనానికి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఏర్పాట్లను మరింత పెంచి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది, లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు వరకు చేస్తున్న ఏర్పాటులలో ఎటువంటి లోపం లేకుండా చూసినందుకు సిబ్బందిని ప్రశంసిస్తూ, మూల నక్షత్రం రోజు కూడా ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తుల వద్దకు వెళ్లి సిబ్బంది చూసుకొని, అధికారులను ఆదేశించారు. భక్తులు అధిక శాతం లో వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల వద్దకు తామే ఒకటికి రెండుసార్లు వెళ్లి క్యూ లైన్ లో ఉన్న భక్తులకు త్రాగునీరు అందించడంలో ఎటువంటి చాప్యం వహించరాదని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *