Breaking News

శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి పూజలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విజయదశమి సందర్భముగా దేవి చౌక్ లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , డిల్లీ రావు దంపతులు, కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకొని  పూజలు నిర్వహించారు. దేవీ నవరాత్రులు సందర్భంగా  దేవి చౌక్ లో కొలువై ఉన్న  శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , డిల్లీ రావు దంపతులు, కుమార్తె సిరి చందన, కుటుంబ సభ్యుల తో కలిసి విజయ దశమి సందర్భంగా కుటుంబ సభ్యుల తో కలిసి అమ్మ వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పూర్ణకుంభంతో కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఆరోగ్యవంతంగా  అష్టైశ్వర్య భోగభాగ్యాలతో  ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. ఈ సందర్భంగా  అర్చకులు  వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *