Breaking News

జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి

రాజమహేంద్రవరం / గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 17 వ తేదీన ఉదయం 9 గంటలకు గోపాలపురం ఎంపీడీవో కార్యాలయంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమంలో నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి గంటా సుధాకర్, జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయ అధికారి హరిశ్చంద్ర ప్రసాద్ సంయుక్తంగా ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ జాబ్ మేళా కోసం 3 కంపెనీలు హాజరు కానున్నాయన్నారు.
ఎస్.ఎస్.సి /ఇంటర్/డిగ్రీ /ఎంబిఏ, ఎంసీఏ విద్యార్హతలు గల 19 నుండి 30 సంవత్సరములు వయస్సు గల వారికి ఈ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కలిపించబడుతాయని వారు తెలియచేశారు. ఆసక్తి కలిగిన అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు అందరూ https://forms.gl/iEM743xYndjFvXwi8 నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి సదరు ” జాబ్ మేళా” కు రెజ్యూమ్ లతో పాటు హజరు కావాలని కోరడం జరిగింది. ఆధార్, ఇతర సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో, సిద్ధపడి ఈనెల 17 వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయం, గోపాలపురం వద్దకు రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు “,8499943366” 7396740041నంబర్ల ను సంప్రదించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *