ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS)” కార్యక్రమము జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమం ఈనెల 14వ తేదీన రద్దు

-మండలాల్లోని ప్రత్యేక అధికారులందరూ మండలాల్లోని ఉండాలి
-అక్టోబర్ 14 నుండి 16 వరకు కురిసే భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
-జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్

పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
14-10-2024 (సోమవారము) నిర్వహించవలసిన *ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS)కార్యక్రమము రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వయ్య ప్రయాసాలతో ప్రజలు పుట్టపర్తి కలెక్టరేట్ రాకూడదని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని హెచ్చరించిన వాతావరణశాఖ ప్రజలు ఇబ్బందులు గురవుతారని పి జె ఆర్ ఎస్ కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని పై ప్రకటనలో తెలిపారు, అందరు ఆర్డీవోలు, మరియు మున్సిపల్ కమిషనర్లు,అన్ని మండలాల తహసీల్దార్లు, MPDOs, MSOs, CSOs మరియు జిల్లా అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించేలా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు జిల్లా అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *