Breaking News

మునిసిపాలిటీ లలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

-ప్రతి మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని మునిసిపాలిటీ లలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రతి మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జెసి శుభం బన్సల్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, తదితర మునిసిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మునిసిపల్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేసి నీటి శుద్ధి ప్లాంట్ లు, డంపింగ్ యార్డులు, సంపద కేంద్రాలు తదితర వాటికి భూ సంబంధిత పెండింగ్ అంశాలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని, పెండింగ్ ఉన్నవి తమ దృష్టికి తీసుకువస్తే త్వరిత గతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సక్రమంగా అమలు కావాలని తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బయో మిథనాల్ ప్లాంట్, సి అండ్ డి వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ జాగ్రత్తగా అప్రమత్తంగా నిర్వహణ ఉండాలని సూచించారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తూకివాకం, ఎస్టీపీ ఫైటోరిడ్ టెక్నాలజీ ప్లాంట్ తదితరాలు అమలు తదితర అంశాలపై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వివరించారు. వెంకటగిరి ఈఎల్ఎస్ఆర్ నిర్మాణానికి సంబంధించిన భూ సమస్య పరిష్కారమైందని కమిషనర్ తెలిపారు. అలాగే గూడూరుకు సంబంధించి సబ్ కలెక్టర్ వారితో సమన్వయం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్ సూచించారు. పుత్తూరు 2 ఎస్టీపీలు మరియు ఒక (ఎన్ఎస్ టి) నేచురల్ సుయెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వెంకటగిరి సూళ్లూరుపేట డంపింగ్ యార్డ్ అంశంపై మరియు శ్రీకాళహస్తి ఎస్టిపి నిర్మాణానికి సంబంధించిన అంశాలను సంబంధిత రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, జెసి పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.

మున్సిపాలిటీలలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా అమలయ్యే విధంగా మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని, అలాగే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఏదేని అంతరం ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అమృత్ 1.0, ఎఐఐబి మరియు అమృత్ 2.0 కింద భూసేకరణ అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ నేపథ్యంలో సంబంధిత మునిసిపల్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ఆచరణాత్మకంగా అమలు అయ్యేలా ఉండాలని అన్నారు. స్వఛ్చ ఆంధ్ర దిశగా ప్రతి మునిసిపాలిటీ పనితీరు ఉండాలని సూచించారు.

ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ సుబ్బరాయుడు, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్, సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, నాయుడుపేట కమిషనర్ షేక్ ఫజురుల్లా, గూడూరు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *