Breaking News

రూ.29.35 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ అనారోగ్య సమస్యలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఆర్థిక సహాయాన్ని కోరిన 14 మంది లబ్ధిదారులకు రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రూ.29.35 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం మధ్యాహ్నం నగరంలోని మంత్రి నివాసంలో అందించారు. చేసిన సహాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రి కొల్లు రవీంద్రకు ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధిని కంటి తుడుపు చర్యగా విదిలించారని, కానీ కూటమి ప్రభుత్వం రాగానే అర్హులైన వారికి నిధులను అందించి ఆదుకుందని తెలిపారు. ఆ రీతిగా నేడు మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని 14 మంది లబ్ధిదారులకు రూ. 29 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధులను అందించి పేదలను ఆదుకున్నారని, అలాంటి ముఖ్యమంత్రి ఉండటం అందరి అదృష్టమని మంత్రి పేర్కొన్నారు.

నాటి టిడిపి ప్రభుత్వ హయాంలో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం కిడ్నీ డయాలసిస్ సెంటర్, స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిన సంగతులను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *