Breaking News

అధికారులందరూ సమన్వయంతో పని చేయాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులందరూ సమన్వయంతో పనిచేసి డ్రోన్ షో లో విఎంసి ఏర్పాట్లలో లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం సాయంత్రం పున్నమిఘాట్ వద్ద బబూరి గ్రౌండ్స్ లో జరగబోవు డ్రోన్ షో ఏర్పాట్లను పరిశీలించారు.

పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, తాత్కాలిక మరుగుదొడ్లను నిన్నంత ప్రదేశాలలో పెట్టడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. త్రాగునీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని అన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎటువంటి అంతరాయం లేకుండా డ్రోన్ షోను విజయం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్ ) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంట్ ఇంజన్ యువర్ వర్క్స్ పి సత్యనారాయణ, ఈఈ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *