-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను శాఖాధిపతులే స్వయంగా పరిష్కరించాలని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు.
ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏడు ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందులో పన్ను సంబంధించి, అనధికార ఆక్రమణ గురించి, సిసి రోడ్ వేయుటకు, త్రాగునీటి సరఫరా కొరకు, దోబీ ఖానా వద్ద బడ్డిని తొలగించుటకు, కమ్యూనిటీ హాల్ తదితర అంశాలపై ఫిర్యాదులను కమిషనర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ శాఖధిపతులందరూ తమ తమ శాఖల్లో ఉన్న సచివాలయం సిబ్బందిని పర్యవేక్షిస్తూ ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం వల్ల ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకోగలమని తెలిపారు.
ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అసిస్టెంట్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎస్ ఈ (వర్క్స్) పి సత్యనారాయణ, ఎస్ ఈ (ప్రాజెక్ట్స్) సత్యకుమారి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మల్యాద్రి, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News