అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలియచేసాను. రాష్ట్ర పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, అయితే ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే కేంద్రం నుండి మరింత ఉదారంగా సహాయం అందించాల్సిన అవశ్యకత గురించి వారికి వివరించాను. ఎన్నికల సమయంలో జరిగిన ధర్మవరం బహిరంగ సభ గురించి వారు గుర్తు చేసుకోగా, ఆ సభ రాష్ట్ర గతిని మార్చిన విషయాన్ని వారితో పంచుకున్నాను.
Prajavartha Online Telugu News