Breaking News

బాధిత కుటుంబాలకు భరోసా

– జిల్లా కలెక్టర్ చేతన్ చొరవ
– ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందిన ఆర్థిక సాయం

పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ధర్మవరం మండల ప్రధాన కేంద్రంలో నివసిస్తున్న కొన్ని కుటుంబాలు (పెళ్లి బృందం) 2022 మార్చి 26న ప్రత్యేక బస్సులో ధర్మవరం నుండి బయలుదేరాయి. తిరుపతిలో జరిగే పెళ్ళికి మదనపల్లి, పీలేరు, భాకరాపేట ఘాట్ రోడ్డులో రాత్రి 11 గంటల సమయంలో బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. సుమారు 51 మంది పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో పదిమంది చనిపోయారు. 41 మంది క్షతగాత్రులయ్యారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందజేసింది. ప్రస్తుత జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కృషితో ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకున్నారు. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో ఈనెల 18న జమయిందని జిల్లా కలెక్టర్ చేతన్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *