Breaking News

తెనాలి ఎస్ హెచ్ జి  మహిళకు మిషన్ డైరెక్టర్ అభినందనలు

-సయ్యద్ నహరే నిగర్ సుల్తానా ను అభినందిస్తున్న మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల(అక్టోబర్ 10 వ తేది నుండి అక్టోబర్ 20 వ తేది వరకు) జరిగిన అఖిల భారత సరస్ ఎగ్జిబిషన్ విజయనగరంలో ఆంద్ర ప్రదేశ్ నుండి మెప్మా ద్వారా 28 స్టాల్ లలో 47 స్వయం సహాయక సంఘ సభ్యులు వారు తయారు చేసిన ఉత్పత్తులతో అన్ని జిల్లాల నుండి వచ్చి ఎగ్జిబిషన్ నందు పాల్గొనటం జరిగినది. పది రోజులకు గాను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా స్వయం సహాయక సంఘ సభ్యుల ఉత్పత్తులు రూ.45,73,857/- అమ్మకాలు జరిగి తద్వారా లాభం రూ.9,14,771/- వచ్చింది. ఈ మొత్తం లాభం లో అత్యధికంగా గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన సయ్యద్ నహరే నిగర్ సుల్తానా, శుభానల్లా ఎస్ హెచ్ జి సంఘ సభ్యురాలు తయారు చేసిన క్రిస్టల్ బ్యాగ్ మరియు ఆర్టిఫిషియల్ జ్యూయలరి ఉత్పత్తుల ద్వారా రూ.2,67,000/- అమ్మకాలు చేసి ఎగ్జిబిషన్లో పాల్గొన్న ఎస్ హెచ్ జి ల అందరికన్నా అధికంగా అమ్మకం చేయటం జరిగింది. దీనిని గుర్తించిన మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఐఏఎస్ మెప్మా ప్రధాన కార్యాలయానికి పిలిపించి ఆమె తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి అభినందించడం జరిగింది. దీనితో పాటు ఆమె తో పాటు పనిచేసే గ్రూప్ సభ్యులు అందరికి కలిపి ఒక గ్రూప్ యూనిట్ పెట్టుకొనేలా తగిన ఏర్పాట్లు చేస్తామని మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఐఏఎస్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *