Breaking News

బి.యన్.కె.యు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చెస్ పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 22 నుండి 27వ తేదీ వరకు బి.యన్.కె.యు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ ఫెస్టివల్-2024 చదరంగ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా సంగ్రామంలో దేశ విదేశాల నుండి పలువురు క్రీడాకారులు పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసి చెస్ ఫెస్టివల్-2024 చదరంగ పోటీలను ప్రారంభించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ముఖ్య అతిదిగా విచ్చేసిన గ్రాండ్ మాస్టర్ యం.ఆర్. లలిత బాబు, ప్రారంభఅనంతరం బోండా ఉమా, గ్రాండ్ మాస్టర్ తో చెస్ ఆడి క్రీడాకారులకు మరింత ఉత్సాహన్నిచ్చారు.

ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ బోండా ఉమా మాట్లాడుతూ ఇతర దేశాలు,మన దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి విచ్చేసిన క్రీడాకారులు అందరికి విజయవాడను ఈ క్రీడలకు వేదికగా ఎంచుకున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. గ్రాండ్ మాస్టర్ యం.ఆర్. లలిత బాబు మాట్లాడుతూ మూడు దేశాల నుండి ఈ టోర్నమెంట్లో ఐదువందల ఏనిమిది మంది క్రీడాకారులు పాల్గొనడం చాలా సంతోశాన్నిఇచ్చిందన్నారు.

టోర్నమెంట్ కన్వీనర్ షేక్ ఖాసిం మాట్లాడుతూ మొత్తం 508 మంది క్రీడాకారుల్లో ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు, 8మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు, 381మంది ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ కలిగిన క్రీడాకారులు పాల్గొనడంతో ప్రొఫెషనల్ చెస్ క్రీడాకారుల మేధో వికాసానికి ఎంతోగానో దోహదపడుతుందన్నారు. చదరంగం ఆడటం వల్ల విద్యార్థుల్లో మేథో వికాసం అభివృద్ధి చెందుతుందని, సృజనాత్మకత, పోటీతత్వం అలవడుతుందని వై పార్థసారథి అన్నారు

ఆరు రోజులు పాటు జరిగే ఈ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ ఫెస్టివల్ కు వేదికను ఇచ్చినటువంటి ఐకాన్ పబ్లిక్ స్కూల్ యజమాన్యానికి, అలాగే ఐదు వందలమంది పై చిలుకు క్రీడాకారులు పాల్గొనడానికి కారకులైన క్రీడాకారులకు, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్,సెక్రటరీ జగదీష్, చైర్మన్ కె.వి.వి. శర్మ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్వాలాముఖి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణి కుమార్, ది విజయవాడ అసోసియేషన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్ బాషా, మందుల రాజీవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన టోర్నమెంట్ నిర్వాహక బృందం కన్వీనర్ షేక్ ఖాసిం, డైరెక్టర్ విత్తనల కుమార్, సీనియర్ చెస్ కోచ్ మురళీధర్ ఎన్.కే.యూ ప్రెసిడెంట్ భీమారావు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఐకాన్ పబ్లిక్ స్కూల్, కె రాజేంద్ర, చైర్మన్ ఐకాన్ పబ్లిక్ స్కూల్, గుడిపాటి కిషోర్, ప్రెసిడెంట్ రోటరీ మిడ్ టౌన్ విజయవాడ, బి ఎన్ కే యు ట్రెజరర్ నరేష్, బి.యన్.కె.యు.ఫౌండేషన్ కన్వీనర్ షేక్ ఖాసిం, డైరెక్టర్ విత్తనల కుమార్, ఎన్.కే.యూ ప్రెసిడెంట్ భీమారావు, సీనియర్ చెస్ కోచ్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *