విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ. ఎస్టీ వర్గీకరణ. క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా డిసెంబర్ 19 న ఛలో అమరావతి సచివాలయం ఆందోళ కార్యక్రమం నకు పెద్ద ఎత్తున దళిత జాతులు తరలి రావాలని ఈ సందర్బంగా కరపత్రం విడుదల చేసిన దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు. ఎస్సీ. ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేషనల్ చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. శనివారం విజయవాడ లోని తుమ్మల పల్లి కళా క్షేత్రం ఎదురుగా గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వర్గీకరణ. క్రిమిలేయర్ అమలు జరిగితే.. మొత్తం దళిత జాతులు రాజ్యాంగ పరమైన హక్కులు. అవకాశాలు కోల్పోతారని తెలిపారు. దీనిపైన సుప్రీం కోర్ట్ వర్గీకరణ చేయమని ఆగష్టు 1 వ తారీఖున ఇచ్చిన జడ్జిమెంట్ లో చెప్పలేదని ప్రకటించారు. ఐతే మనువాద పాలకులు దళితుల ను పొలిటికల్ పవర్ ను సాధించకుండా.. అణిచివేయడానికి.. ఎస్సీ. ఎస్టీ ల్లోని కొన్ని కులాలను ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ..రాజ్యాంగ వ్యతిరేకంగా సామాజిక చిచ్చు కు కుట్రలు చేశాయని ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో అత్యధికముగా జనాభా కల్గిన మాల. ఎరుకుల. యానాదుల మనోభావాలకు వ్యతిరేకంగా.. రాష్ట్ర ఎన్డిఎ చంద్రబాబు. పవన్ కళ్యాణ్. బీజేపీ సర్కార్ వర్గీకరణ. క్రిమిలేయర్ అమలు చర్యలు చేపడితే.. ప్రభుత్వం పైన సామాజిక తిరుగుబాటు తప్పదని కృష్ణ స్వరూప్ హెచ్చరించారు. ఈ పోరాటం లో ఎస్సీ. ఎస్టీ ప్రజలు వేలాది గా పాల్గొవడం ద్వారా దళితుల సత్తా ప్రభుత్వం కు తెలియజేయాలనీ కృష్ణ స్వరూప్ పిలుపు ఇచ్చారు. ఈ కరపత్రం విడుదల కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ GK బాబు. జాతీయ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మాదే సుజాత. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు బండి. ఈశ్వర్. ఎస్సీ. ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏపీ రాష్ట్ర శాఖ కన్వీనర్ ఆవులు ప్రవీణ్ కుమార్ పార్టీ. ఆల్ ఇండియా ఎస్సీ. ఎస్టీ అడ్వకేట్స్ ఫోరమ్ రాష్ట్ర ప్రతినిధి సుదర్శనం అజయ్. డీబీపీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా శాఖ అధ్యక్షులు రాచూరి. విజయ్ కుమార్. నాయకులు ఉప్పాడ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News