– నిర్దేశ గడువులోగా సరైన పరిష్కారం చూపండి.
– అధికారులతో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించి, నిర్దేశ గడువులోగా సరైన పరిష్కారం చూపేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా.. డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు తదితరులతో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా నిధి మీనా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టిసారించడం జరుగుతోందని.. జిల్లాస్థాయి అధికారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయంతో పనిచేసి అర్జీల పరిష్కారంపై దృష్టిసారించాలన్నారు. ఎప్పటికప్పుడు అర్జీల పరిష్కారానికి సంబంధించిన పురోగతిపై ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 157 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూ-60, పోలీస్-20, ఎంఏయూడీ-23, పంచాయతీరాజ్-10, ఆరోగ్యం-8, విద్య-5, ఎక్సైజ్-3, ఉపాధి-3, డీఆర్‌డీఏ-2, ఇరిగేషన్-2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్-2, ఆర్ అండ్ బీ-2, మైన్స్ అండ్ జియాలజీ-2, వ్యవసాయం-1, ఐసీడీఎస్-1, ఉద్యాన-1, మైనారిటీ సంక్షేమం-1, మార్కెటింగ్-1, ఏపీసీపీడీసీఎల్-1, హౌసింగ్-1, డ్వామా-1, ఎండోమెంట్స్-1, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం-1, కాలుష్యం-1, సహకార-1, ఆహార తనిఖీలు-1, పౌర సరఫరాలు-1, బ్యాంకు సంబంధిత-1 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News