Breaking News

జువెనైల్ జస్టిస్ చట్టం 2015 లోని సెక్షన్ 41 క్రింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల సంరక్షణ కేంద్రాలు ఇతర ఏదైనా చట్టం కింద లైసెన్సు తీసుకున్నప్పటికీ, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం 2015 లోని సెక్షన్ 41 క్రింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకో వాలని అదనపు జిల్లా పర్యవేక్షణాధికారి పి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు.

బాలల సంరక్షణ కేంద్రాలు జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం 2015, సవరించబడిన చట్టం 2021 లోని సెక్షన్ 41 ప్రకారం మరియు జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) నిబంధనలు 2016 మరియు సవరించబడిన నిబంధనలు 2022 లోని నిబంధన 21 ప్రకారం, ‘రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లల’ కొరకు మరియు ‘చట్టంతో విభేదించబడిన పిల్లల’ కొరకు, పూర్తిగాకానీ, పాక్షికంగాగాని, ప్రభుత్వంచేతగాని, ప్రభుత్వేతరసంస్థల చేతగాని, కేంద్రప్రభుత్వం నుండి లేదా రాష్ట్రప్రభుత్వం నుండి నిధులు పొందడంద్వారా కానీ, ప్రభుత్వనిధులు లేకుండాకానీ, నడుపబడుతున్న బాలసంరక్షణ కేంద్రాలు, ఏదైనా చట్టం కింద లైసెన్సు తీసుకున్నప్పటికీ, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం 2015 లోని సెక్షన్ 41 క్రింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకో వారన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సంచాలకులు, బాలల సంక్షేమము మరియు సంస్కరణల సేవల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈనెల 22వ తేదీన అధికారికంగా ప్రకటన జారీ చేసారన్నారు. దీని ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నవారు నిర్దేశించబడిన ప్రొఫార్మా లో నింపబడిన దరఖాస్తుతో పాటు అన్ని కాపీలు జతచేసిన దరఖాస్తును ఈ నెల11వతేదీ లోగా సంచాలకులు, బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీధిబాలల సంక్షేమశాఖ, విజయవాడ, కార్యాలయానికి అందజేయవలసి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, చిరునామా, అర్హతలు, జాతపరచాల్సిన డాక్యుమెంట్ల చెక్ లిస్టులు మొదలైనవాటిని http://wdcw.ap.gov.in వెబ్ సైటు ద్వారా పొందవచ్చున న్నారు. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ (లేదా) రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే మరియు soft copies cci.reg2024@gmail.com ద్వారా పంపాలన్నారు.
ఇతర వివరాలకు అదనపు జిల్లా పర్యవేక్షణాధికారి విజయవాడ, ఎన్టిఆర్ జిల్లా, 77803 99779 వారిని మరియు యమ్. రాజేశ్వరరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి, విజయవాడ, ఎన్టిఆర్ జిల్లా, 99480 57583 వారిని సంప్రదించవచ్చునని
అదనపు జిల్లా పర్యవేక్షణాధికారి పి జ్యోతి ఆప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *