Breaking News

బెంజ్ సర్కిల్ వద్ద గల గ్రీనరీ పనులను వేగవంతం చేయండి

-కాటాను ఒక నెలలో అందుబాటులోకి తీసుకురండి
-అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెంజ్ సర్కిల్ వద్దగల ఫ్లైఓవర్ కింద జరుగుతున్న సుందరీకరణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆటోనగర్, బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పనులు జరగాలని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అన్నారు. ఆటోనగర్ గార్బేజి ట్రాన్స్ఫర్ లో కాటా ను ఒక నెలలోపు పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించిరు. ఆటోనగర్ లో ఉన్న గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచాలని, కాటాను ఒక నెలలో అందుబాటులోకి తీసుకురావాలని, పరిరక్షణ కొరకు రైలింగ్స్ను, గోడను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి. సత్యకుమారి, ఇతర శానిటరీ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *