Breaking News

కాలేజీ యాజమాన్యాలు వారి వద్ద చదువుకుంటున్న విద్యార్థులను పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయుల కొరకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయి

-పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆర్టీఎఫ్ (RTF) మరియు ఎమ్ టి ఎఫ్ (MTF) అన్ని బకాయులను ప్రభుత్వం వారు త్వరలో నేరుగా కళాశాల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయనున్నారు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆర్టీఎఫ్ (RTF) మరియు ఎమ్టిఎఫ్ (MTF) అన్ని బకాయులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్నారని, కాలేజీ యాజమాన్యాలు వారి వద్ద చదువుకుంటున్న విద్యార్థులను సదరు స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయుల కొరకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తల్లుల ఖాతాల్లో సదరు ఫీజు రీయింబర్స్మెంట్ నగదు జమచేసే వారనీ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను 2024 – 25 విద్యా సంవత్సరం నుండి కళాశాలల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పాతవిధానాన్ని పునరుద్ధరిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పేర్కొన్నారని, వాటితో పాటు గత ప్రభుత్వం పెట్టిన 3500 కోట్ల రూపాయల బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని తెలిపి ఉన్నారని, బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశం ఆమోదం కొరకు పెట్టారని కలెక్టర్ తెలిపారు. పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నఆర్టీఎఫ్ (RTF) మరియు ఎమ్ టి ఎఫ్ (MTF) అన్ని బకాయులను ప్రభుత్వం వారు త్వరలో విడుదల చేయనున్నట్లుగా తెలిపిన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు వారి వద్ద చదువుకుంటున్న విద్యార్థులను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయుల కొరకు వారి సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, వారిని పరీక్షలు రాయనీయకుండా చేయడం, లేక వారిని వివిధ రకాలుగా మానసిక ఆందోళనకు, భయాందోళన గురి చేయడం చేయరాదని, అలా చేస్తే నిబంధనల మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిస్తూ అన్ని కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *