-సిందేపల్లి గ్రామం నుండి రాచగున్నేరి వద్ద ఉన్న 400 – 220 కె. వి – 132 కె. వి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రోడ్డు కు ప్రతి పాదనలు : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్
ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏర్పేడు -వెంకటగిరి రోడ్డు(ఐ ఐ టి కాలేజ్) నుండి లాంకో ప్యాక్టరీ వరకు మరియు సిందేపల్లి గ్రామం నుండి రాచగున్నెరి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రోడ్లు ఏర్పాటు కు ప్రతిపాదనలు తయ్యారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పేడు మండల పరిధిలో ఉన్న లాం కో ప్యాక్టరీ మరియు రాచగున్నేరి వద్ద 400 /220 / 132 కె వి విద్యుత్ సబ్ స్టేషన్ కు వరకు రోడ్లు ఏర్పాటు సంబంధించి శ్రీకాళహస్తి ఆర్ డి. బాను ప్రకాష్ రెడ్డి, విద్యుత్ శాఖ,ఎస్ ఈ. శ్రీనివాసులు రావ్,లాంకో ప్యాక్టరీ ఎక్టార్ దొరైరాజ్ లతో కలసి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ముందుగా ఏర్పేడు – వెంకటగిరి రోడ్డు, ఐ ఐ టి కాలేజ్ నుండి లాంకో ప్యాక్టరీ వరకు 60 అడుగుల వెడల్ప రోడ్డు ఏర్పాటు కు లాంకో కంపిణి వారు ప్రభుత్వాని కొరియున్నారు, మరియు సిందే పల్లి గ్రామం నుండి రాచగున్నేరి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రోడ్డు ఏర్పాటు కు భూమిని కేటాయించాలని ఏ. పి.ట్రాన్స్ కో ప్రభుత్వం ను కొరియున్నారు.దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ లాంకో కంపిణి ప్రతి నిధులు, విద్యుత్, ఆర్ & బి,పంచాయతీ రాజ్,శ్రీకాళహస్తి ఆర్డీ ఓ,ఏర్పేడు మండల తహశీల్దార్ లతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు ఏర్పాటు చేయుటకుఅవసరమైన భూమిని పరిశీలించాలన్నారు. ఆర్ & బి. ఎస్ ఈ,పంచాయతీ రాజ్ ఎస్ ఈ,ఆర్ డి ఓ మళ్ళీ ఒక్కసారిగా పరిశీలించి రోడ్డు కు ఏర్పాటు కు అవసరమైన భూమి,రోడ్లు ఏర్పాటు కి అంచనాలు తయ్యారు చేయాలని సంబందిత అధికారులకు చూచించారు. సిందేపల్లి నుండి శ్రీకాళహస్తి కి లాంకో ప్యాక్టరీ ప్రక్కన వెళ్లే దారి సంక్రాంగా లేదని రాత్రి పూట వెళ్లంటే చాలా ఇబ్బందిగా ఉందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, దారి పొడవునా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతు లకు కలెక్టర్ చూచించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్ ఈ,డి ఈ,ఏ ఈ లతో కలసి రాచగున్నెరి వద్ద ఉన్న 400 -220 – 132 కె వి విద్యుత్ సబ్ స్టేషన్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో లాంకో ప్యాక్టరీ ప్రతి నిధులు, ఏర్పేడు మండల తహశీల్దార్ భార్గవి, పంచాయతీ రాజ్, ఆర్ & బి,విద్యుత్ శాఖ డి ఈ లు,ఏ ఈ లు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News