రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కూరగాయలు పండించే రైతులకు సాగు పద్ధతులు, మెళకువలు, అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలు, నీటి యాజమాన్యం వ్యవసాయ పద్ధతుల పై డ్రిప్ ఇరిగేషన్, స్ప్లింకర్ విధానం, షేడ్ నెట్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా మైనర్ ఇరిగేషన్ అధికారి ఏ. దుర్గేష్ తెలియ చేశారు. బుధవారం కూరగాయలు పండించుటకు మెళకువలు, అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలపై కాట వరం రైతులతో గ్రామములో అవగాహనా సదస్సు నిర్వహించి, క్షేత్ర స్థాయిలో పొలాలను సందర్శించారు. ఈ కార్యక్రమం మార్కెటింగ్, ఉద్యానవన శాఖ సంయుక్తముగా నిర్వహించినట్లు దుర్గేష్ తెలియ చేశారు. రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఇతర అంశాలపై అవగాహనా కొరకు సదస్సు నిర్వహించడమైనదన్నారు. మైక్రో ఇరిగేషన్ యొక్క సబ్సిడీ కింద సన్నకారు మరియు చిన్న రైతులు చేయూత నివ్వడం జరుగుతోందన్నారు..
బిందు సేద్యం యూనిట్స్ చిన్న సన్నకారు రైతులకి 90 శాతం సబ్సిడి కింద రెండూ హెక్టార్ల విస్తీర్ణం వరకు గరిష్టంగా రూ.2 లక్షల 18 వేల రూపాయల సబ్సిడీ పరిమితి రాష్ట్ర వ్యాపితంగా అమలు చేస్తుండగా, కోస్టల్ ప్రాంతంలోని ఇతర మధ్యస్థ & పెద్ద రైతులు వర్గంతో సంబంధం లేకుండా 50 శాతం సబ్సిడి కింద 2 నుంచి 5 హెక్టార్ల విస్తీర్ణం కు గరిష్టంగా రూ.3 లక్షల 9 వేల రూపాయల సబ్సిడీ పరిమితితో యూనిట్స్ ఏర్పాటుకు అవకాసం ఉందన్నారు.
స్ప్రింక్లర్ ఇరిగేషన్ యూనిట్స్ చిన్న సన్నకారు రైతులకి 55 శాతం సబ్సిడి కింద 40 సెంట్ల నుంచి రెండూ హెక్టార్ల విస్తీర్ణం వరకు రైతులకు, మధ్యస్థ & పెద్ద రైతులకు 45 శాతం సబ్సిడి కింద 2 నుంచి 5 హెక్టార్ల విస్తీర్ణం గల రైతులకు యూనిట్స్ ఏర్పాటుకు అవకాశం ఉందని దుర్గేష్ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఏ డీ ఎమ్. సునీల్ వినయ్, మండల మైక్రో ఇరిగేషన్ అధికారి శైని, రైతుబజారుకు వొచ్చే కూరగాయలు పండించే రైతులు, ఎస్టేటు అధికారులు, ఉద్యానవన , మైక్రో ఇరిగేషన్ మార్కెటింగ్ , అధికారులు పాల్గొన్నారు.