Breaking News

కలవ చర్ల గ్రామ సభకు హాజరైన జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
కలవ చర్ల గ్రామ సభలో 15 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. బుధవారం రాజానగరం మండలం కలవ చర్ల గ్రామ సభకు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, గ్రామ సభలో ఆర్ వో ఆర్ నిమిత్తం నాలుగు అర్జీలు , భూముల సర్వే కోసం 11 మంది అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు.

వొచ్చిన అర్జిలలో కొన్ని…
సహసంబంధం సవరణ కొరకు (ఆర్ వో ఆర్) గ్రామానికి చెందిన చప్పిడి భవానీ సర్వే నెంబర్ 575 /2 ను సర్వే నెంబర్ 576 , 575 గా మార్పు కొసం కోరుతూ అర్జీ అందచేశారు. గ్రామానికి చెందిన ఆదం శ్రీహరి కి చెందిన సర్వే నెంబర్ 494 / ఏ71 లో ఉన్న 50 సెంట్ల భూమి విస్తీర్ణం కొలతలు 49 సెంట్ల గా ఉందనీ, సరి చేయవలసి నదిగా కోరియున్నారు. ఈ గ్రామ సభలో రాజనగరం తాసిల్దారు లావణ్య, రెవిన్యూ సిబ్బంది , గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *