-శనివారం వెలుగుబంద కాలనీ సందర్శన
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
హౌసింగ్ కాలనీల్లో విద్యుత్, త్రాగునీటి సరఫరా , గార్బేజ్ సేకరణ పై కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు స్థితిగతుల పై సమన్వయ శాఖల అధికారులతో, హౌసింగ్ క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, హౌసింగ్ లే అవుట్ లలో ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖల అధ్వర్యంలో విద్యుత్ లైన్లు, రహదారుల అభివృద్ధి, త్రాగునీరు, అవసరాలకి అనుగుణంగా నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మూడు అంశాల ప్రాతిపదికన పనులను చేపట్టడం, పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. గతంలో ప్రతిపాదించిన పనులను పూర్తి చేసేలా చర్యలు, కొత్తగా గుర్తించిన పనులకి ప్రతిపాదనలు పంపడం, మైనర్ పనులను సంబంధిత గ్రామ పంచాయతీ అధ్వర్యంలో చేపట్టడం జరగాలన్నారు. గతంలో టెంపరరీ విద్యుత్ కనెక్షన్ కి చెంది వాటికీ శాశ్వత కనెక్షన్ గా మార్చడం, అవసరమైన లే అవుట్ లలో విద్యుత్ లైన్లు క్రమబద్ధీకరణ చెయ్యలన్నారు. ఆర్ డబ్ల్యూ ఎస్ కింద టెంపరరీ నీటి సరఫరా కనెక్షన్లు శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి చెయ్యల్సి ఉందన్నారు.
హౌసింగ్ లే అవుట్ లలో మరిన్ని ఇళ్ళ నిర్మాణాలు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఇల్ల నిర్మాణాలు చేస్తున్న దృష్ట్వా, పట్టణానికి చెందిన వారికి ఇళ్లు కేటాయించినా, ఆయా ప్రాంతాలలో పారిశుధ్యం, ఇతర నిర్వహణ విషయంలో పంచాయతిలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. శనివారం సమన్వయ శాఖల అధికారులతో కలిసి వెలుగుబంద హౌసింగ్ లే అవుట్ ను పరిశీలించనున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.
ఈ సమావేశంలో ఇన్చార్జి హౌసింగ్ పిడి కె ఎల్ శివ జ్యోతి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ – బి వి గిరి, విద్యుత్ సంస్థ ఎస్ ఈ టి..తిలక్ కుమార్, ఇన్చార్జి జిల్లా పంచాయతి అధికారి ఎమ్. నాగలత , హౌసింగ్ క్షేత్ర స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News