Breaking News

డిసిల్టెషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్ను ఇసుక ఖర్చు రూ.229 /-

-జిల్లా వ్యాప్తంగా ఒపెన్ రిచ్ లు వారీగా ఖర్చుల వివరాలు ప్రకటించడం జరిగింది
-ఫిర్యాదు నమోదు కోసం జిల్లాలో స్థాయిలో 1800-425-540 , రాజమండ్రీ డివిజన్ పరిధిలో 0883- 2442344 నెంబర్లు
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మరీ అంత అమాయకంగా వ్యవహరించవద్దు, ఇసుక ర్యాంపు వద్ద లోడింగ్ చార్జీల వసూళ్ల విషయంలో అక్కడ విధుల్లో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి ప్రదీప్ వ్యవహార శైలి పై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రశ్నించడం జరిగింది. బుధవారం ఉదయం స్థానిక ధవళేశ్వరం గాయత్రి ర్యాంపు, వేమగిరి తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించడం జరిగింది. అక్కడ వినియోగదారులతో, లారీ డ్రైవర్లు తో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇసుక సరఫరా విధానం లో అధిక మొత్తంలో ఖర్చులు వసూళ్లు పై వినియోగదారులు, లారీ డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదులను రికార్డు చెయ్యాలని అక్కడి సిబ్బందిని ఆదేశించడం జరిగిందన్నారు.

ఇసుక సరఫరా విధానం లో అత్యంత పారదర్శకత తో వ్యవహరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డి సిల్టేషన్ పాయింట్స్ వద్ద టన్ను ఇసుక ఖర్చు కింద రూ.229 మేర నిర్ణయించడం జరిగిందన్నారు. అదే విధంగా వాహనం లోకి ఇసుక లోడింగ్ ఖర్చు కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో హేతుబద్ధత కలిగి ఖర్చుల నిమిత్తం చెల్లింపులు జరపాలని కోరారు. అయితే ఇదే క్రమంలో ఖర్చులను ఇష్టానుసారం నిర్ణయించ రాదని స్పష్టం చేశారు. బోట్స్ మ్యాన్ సొసైటి ల సభ్యులు ఇసుక త్రవ్వకం జరిపి వొడ్డుకు చేర్చడం జరుగుతుందని, ఎక్కడ నుంచి లారీలలోకి ఆ లోడింగ్ చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు.  జిల్లాలో గుర్తించిన డిసిల్టెషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్ను ఇసుక ఖర్చు రూ.229 /- గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. అదే క్రమంలో బోట్స్ మ్యాన్ సొసైటి లు ఓపెన్ రిచ్ ల వద్ద ఇసుక త్రవ్వకాలు ఖర్చులను నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్ ప్యానల్ అయిన బోట్స్ మ్యాన్ సొసైటి ఒపెన్ రిచ్ ల వారీగా ఖర్చుల వివరాలు ప్రకటించడం జరిగిందన్నారు. నిర్ణయించిన ఖర్చుల కంటే ఎక్కువగా వసూళ్లు చేసిన, వాహనాలకు లోడింగ్ చెయ్యకపోయినా, ఎటువంటి ఆటంకం కలిగించిన ఫిర్యాదు చెయ్యాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు నమోదు కోసం జిల్లాలో స్థాయిలో 1800-425-540 , రాజమండ్రీ డివిజన్ పరిధిలో 0883- 2442344 నెంబర్లు అందుబాటులో ఉంచామన్నారు.

ఓపెన్ రిచ్ ల వద్ద త్రవ్వకాలు ఖర్చులు…
రీచ్ పేరు, టన్నుకు నిర్ణయించిన ఖర్చుల వివరాలు రీచ్ లు వారీగా  వేమగిరి-కడియపులంక రూ.61.37 ,  వంగలపూడి -1 రూ. 67.59 , వంగలపూడి -2 రూ.70.19 , ములకల్లంక- కాటవరం రూ.61.36 ,  తీపర్రు -2 రూ.96.02 , తీపర్రు -3 రూ. 96.02 , ముక్కామల -2 రూ.116.49 ,  కాకరపర్రు-1 రూ.117.02 , పందలపర్రు రూ.104.42 , జీడిగుంట రూ.81.32 , పెండ్యాల-కానూరు రూ.68.96 , కుమారదేవం రూ. 80.27 ,  చిడిపి రూ.78.17 , కుమారదేవం-1 రూ.
78.17 ,  కుమారదేవం-3  రూ. 91.82 , వేగేశ్వరపురం రూ.69.76 లు

కలెక్టర్ వెంట ఎడి మైన్స్ డి ఫణి భూషణ్ రెడ్డి , ఇతర అధికారులు, రెవెన్యు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *